హ్యాపీడేస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో నిఖిల్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నిఖిల్ తనదైన నటనతో ప్రేక్షకులని అలరించాడు. ఈ సినిమా తర్వాత సోలోగా చేసిన కొన్ని సినిమాలు బెడిసికొట్టాయి. కానీ ఆ తర్వాత సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన "స్వామి రారా" సినిమా నిఖిల్ కెరీర్లో మంచి విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత వరుస విజయాల బాట పట్టాడు.

 

 

అయితే విజయాల పరంపర కొనసాగుతుండగానే కిరాక్ పార్టీ సినిమాతో అతనికి బ్రేక్ పడింది. అలాంటి సినిమాలు తెలుగులో చాలా రావడంతో నిఖిల్ కి నిరాశే మిగిలింది. ఈ సినిమా తర్వాత నిఖిల్ చేసిన చిత్రం అర్జున్ సురవరం. మొదటి నుండి ఎన్నో వివాదాల నడుమ, ఎన్నో విడుదల తేదీల నడుమ ఎప్పుడు విడుదల అవుతుందో తెలియని అయోమయంలో ఎట్టకేలకు ఒక విడుదల తేదీని కన్ఫర్మ్ చేశారు.

 

ఈ నెల 29 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముండుకు రాబోతుంది.  ఎప్పుడో సంవత్సరం క్రితం విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల విడుదలకి నోచుకోలేదు. ఒక దశలో అసలు విడుదల అవుతుందా కాదా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ వాటన్నింటిని దాటుకుంటూ ఈ నెల 29 విడుదల చేస్తున్నారు. ఈ మేరకుఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్ర బృందం.

 

 

 

అయితే సినిమా విడుదల ఇంత ఆలస్యం అవడంతో జనాల్లో నిఖిల్ పట్ల సానుభూతి పెరిగింది. ఆ సానుభూతి ట్రైలర్ కి వచ్చిన స్పందన చూస్తే అర్థం అవుతుంది. దాంతో ఈ సినిమాని హిట్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అదీ గాక ఈ సినిమా విడుదల గురించి ఎన్ని కష్టాలు పడ్డారో నిఖిల్ చెప్పిన మాటలు జనాల్లోకి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. సినిమా కంటెంట్ బాగుంటే, సింపతీ కూడా వర్కవుట్ అయ్యి సినిమా హిట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అదే జరిగితే ఇన్ని రోజులు టెన్షన్ గా ఫీలయిన నిఖిల్ మొహంలో నవ్వులు విరబూస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: