ఎస్ ఎస్ రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరంభీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో చరణ్ కు జోడీగా బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తుండగా, తారక్ సరసన హాలీవుడ్ హీరోయన్ ని ఎంపిక చేశారు. తాజాగా చిత్రయూనిట్ తారక్ కు జోడీగా నటించే హీరోయిన్ ను ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు. 

ఈ చిత్రంలో సెకండ్ లీడ్ హీరోయిన్ గా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మారిస్ ను సెలెక్ట్ చేశారు. దీంతో ఇన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు ఎట్టకేలకు తెరపడింది. ఈ మూవీలో మరో ఇద్దరూ హాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నట్లు తెలిపారు. ఇందులో మెయిన్ విలన్ గా రే స్టీవెన్సన్ నటిస్తుండగా, మరో ముఖ్య పాత్రలో నటి అలిసన్ డూడీ నటిస్తోంది.

గూగుల్ ఇండియాలో నిన్న అత్యధికంగా శోధించిన రెండవ కీవర్డ్ మోరిస్, ఎన్టీఆర్‌కు జోడీగా లండన్ భామ ఒలీవియా మోరిస్‌ను కొందరు ఫన్నీ ట్వీట్లు చేస్తున్నారు. ట్విట్టర్ లో అంతకుముందు ఒలీవియాకు కేవలం 300 మంది ఫాలోవర్లే ఉండగా ఎప్పుడైతే ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తోందని ప్రకటించారో ఆ ఒక్కరోజులోనే ఆమె ఫాలోవర్స్ సంఖ్య 10వేలు దాటిపోయింది. అయితే ఒలీవియాను ఉద్దేశిస్తూ చాలా మంది ట్వీట్లు చేశారు.

తొలి తెలుగు సినిమాలో ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో కలిసి నటిస్తోంది కాబట్టి.. కాస్త బ్యూటీని మెయింటైన్ చేసుకోమని కొందరు సలహా ఇచ్చారు. మరికొందరేమో ఇది జస్ట్ సాంపుల్ మాత్రమే పిక్చర్ అభీ బాకీ హై అంటూ కామెంట్లు చేశారు. ఇక ఈ చిత్రం ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తైనట్లు టీం ప్రకటించింది. ఇందులో ఐర్లాండ్‌కు చెందిన రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడీ విలన్లుగా నటించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: