మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ సినిమా సైరా నరసింహా రెడ్డి. తొలి తెలుగు స్వాతంత్య్ర పోరాట యోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మోస్ట్ వెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీ అక్టోబర్ 2 న గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిందన్న విషయం తెలిసిందే..

 

 

ఇక కొణెదల ప్రొడక్షన్స్‌లో, సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ఈ చిత్రాన్ని సుమారు రూ.300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించారు.. దాదాపుగా సిని రంగంలోని ప్రముఖ ఆర్టిస్టులందరు ఈ చిత్రంలో నటించగా ప్రపంచ వ్యాప్తంగా 5 భారతీయ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే..

 

 

ఇకపోతే ఈచిత్రంలో చిరు, అమితాబ్ బ‌చ్చ‌న్, త‌మ‌న్నా, న‌య‌న‌తార‌ల‌తో పాటు విజ‌య్ సేతుప‌తి, సుదీప్, జ‌గ‌ప‌తి బాబు, నిహారిక త‌మ పాత్ర‌ల‌కి చక్క‌గా న్యాయం చేశారు. ఇదే కాకుండా దేశ‌భ‌క్తిని ఇనుమ‌డించే ఈ సినిమాలో క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌ను మిళితం చేసి చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించారు.. సురేందర్‌రెడ్డి.

 

 

రేనాటి వీరుడు “సైరా న‌ర‌సింహా రెడ్డి” జీవిత నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్క‌గా, మూవీ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. యుద్ద స‌న్నివేశాలు, వీరోచిత ఘ‌ట్టాలు, భారీ డైలాగులు ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ని దోచుకున్నాయి. రీసెంట్‌గా ఈ చిత్రం 34 సెంట‌ర్స్‌లో 50 రోజులు పూర్తి చేసుకుంది.

 

 

అయితే ఇప్పుడు ఈ పీరియాడిక‌ల్ మూవీని నేటి అంటే న‌వంబ‌ర్ 21 నుంచి ఆన్‌లైన్‌లో హెచ్‌డీ ప్రింట్ ద్వారా అందుబాటులో ఉంటుందని అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ప్రకటించింది.

 

 

ఇకనుండి సైరా సినిమాను తమిళ్‌, తెలుగు, కన్నడ, మళయాళం వెర్షన్లను ఆన్‌లైన్‌లో వీక్షించవచ్చని తెలిపింది. ఇక హిందీ వెర్షన్‌ త్వరలోనే ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానుందని తెలిపింది.. ఇప్పటి వరకు ఈ సినిమా చూడని ప్రేక్షకులు ఏంచక్కా ఇంట్లో కూర్చుని ఆనందంగా ఎప్పుడంటే అప్పుడు ఇక ఈ మూవీని చూడవచ్చూ.

మరింత సమాచారం తెలుసుకోండి: