తెలుగు సినిమా ఇండస్ట్రీలో పూనమ్ కౌర్ గురించి తెలియని వ్యక్తులు ఉండరు.  పవన్ కళ్యాణ్ పై తనదైన శైలిలో విరుచుకుపడిన నటి ఎవరు అంటే ముందు వరసలో ఉండేది పూనమ్ కౌర్ అనే చెప్పాలి.  చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా పూనమ్ కౌర్ ఏపి బ్రాండ్ అంబాసిడర్ గా కొన్నాళ్ళు పనిచేసింది.  ఆ సమయంలోనే పవన్ పై వ్యాఖ్యలు చేసింది.  పవన్ కళ్యాణ్ గురించి నెగెటివ్ కామెంట్స్ చేస్తూ అనేకసార్లు మీడియాలో తమ రేటింగ్ ను పెంచుకున్నారు.  


స్వతహాగా పంజాబీ అయినా పూనమ్ ఇటీవలే పాక్ వెళ్ళింది.  అదేంటి పాకిస్తాన్ లో ఆమెకు ఏం పని అని అడగకండి.  నవంబర్ 9 వ తేదీన కర్తార్ పూర్ కారిడార్ ఓపెన్ చేశారు కదా.  కర్తార్ పూర్ కారిడార్ గుండా పూనమ్ మాములు భక్తులతో కలిసి గురుద్వారా వెళ్ళింది.  అక్కడ గురునానక్ మందిరాన్ని దర్శించుకున్నది.  పూజలు చేసింది.  అక్కడి నుంచి తిరిగి వచ్చే సమయంలో ఇండియా పాక్ బోర్డర్ లో ఓ గ్రామంలో ఉన్న శివాలయాన్ని దర్శించుకున్నది.  


ఆ ఆలయం పేరు కాట్ రాజ్ ఆలయం.  దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం స్వాతంత్య్రానికి పూర్వం ఎంతో ప్రసిద్ధి చెందింది.  కానీ, 1947లో స్వాతంత్రం తరువాత ఈ దేవాలయం పాక్ లో కలిసిపోయింది.  దీంతో పాక్ లోని ప్రజలు దీనిని సరిగా పట్టించుకోవడం లేదు.  పురాతన ఆలయం కాబట్టి దాన్ని అలానే వదిలేశారు.  అప్పుడప్పుడు భక్తులు ఆ ఆలయాన్ని శుభ్రపరుస్తుంటారు.  ఎలాగో పాక్ వెళ్ళింది కాబట్టి, పూనమ్ కౌర్ కాట్ రాజ్ ఆలయాన్ని సందర్శించుకుంది.  


అక్కడ శివలింగానికి పూజలు చేసింది.  ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  కర్తార్ పూర్ కారిడార్ ఏర్పాటుకు ఇమ్రాన్ ఖాన్ చేసిన కృషిని ప్రశంసించింది.  ఈ విషయాన్ని పాక్ ప్రధాని స్పెషల్ అసిస్టెంట్ డాక్టర్ ఫిర్దౌస్ ఆషిఖీ అవాన్ మీడియాకు తెలిపారు.  ఇమ్రాన్ ఖాన్ ను పూనమ్ ఎంతగానో మెచ్చుకున్నారని, పాకిస్తాన్ కు రావడం చాలా ఆనందంగా ఉందని పూనమ్ చెప్పినట్టు ఆశిఖి పేర్కొన్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: