‘మహానటి’ మూవీ నిర్మాణ సమయంలో ఆ మూవీ మేకర్స్ ఆ సినిమాలోని ఎన్టీఆర్ పాత్రను జూనియర్ చేత నటింపచేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసారు. నిర్మాత అశ్వినీ దత్ తనకు జూనియర్ తో ఉన్న సాన్నిహిత్యం రీత్యా ఎంత బలవంతం పెట్టినా జూనియర్ సున్నితంగా తిరస్కరించడమే కాకుండా తాను ఎన్టీఆర్ పాత్రకు సరిపోను అంటూ స్పష్టమైన సమాధానం ఇచ్చి అప్పట్లో ఆ ఒత్తిడిని తప్పించుకున్నాడు. 

ఇప్పుడు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ కు అలాంటి ఒత్తిడి ఎదురైతే ‘ఆర్ ఆర్ ఆర్’ వంక పెట్టి జూనియర్ తప్పించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బయోపిక్ ల సీజన్ కొనసాగుతున్న నేపధ్యంలో తమిళ తెలుగు భాషలలో నిర్మిస్తున్న జయలలిత బయోపిక్ ‘తలైవి’ లో ఎన్టీఆర్ పాత్రను చేయమని ఆ మూవీ నిర్మాతలు ఎంతో ఒత్తిడి చేసినా జూనియర్ ఆ ఒత్తిడి ప్రలోభాలకు లోనుకాలేదని  వార్తలు వస్తున్నాయి.

అంతేకాదు తాను ఎన్టీఆర్ పాత్రను ఇప్పట్లో చేయనని అన్నీ కుదిరితే తనకు 50 సంవత్సరాలు దాటినా తరువాత మాత్రమే తాను ఎన్టీఆర్ పాత్రను నటించే ఆలోచన చేస్తాను అంటూ స్పష్టమైన సమాధానం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ మూవీ నిర్మాతలు ఎన్టీఆర్ పాత్రలో నటించమని బాలయ్యను కోరినట్లు సమాచారం. 

అయితే బాలకృష్ణకు ఎన్టీఆర్ బయోపిక్ ఇచ్చిన షాక్ తో మళ్ళీ అటువంటి ప్రయోగం చేయాలనే ఉద్దేశ్యం లేనట్లు అర్ధం అవుతోంది. అయినా ఈ మూవీ నిర్మాతలు బాలయ్యకు అత్యంత సన్నిహితుడైన నిర్మాత కొర్రపాటి సాయి ద్వారా తమ ప్రయత్నాలు గట్టిగానే కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ బయోపిక్ లో జయలలితకు అత్యంతసన్నిహితుడైన శోభన్ బాబు పాత్రకు సంబంధించి ఒక యంగ్ హీరోతో చర్చలు జరుపుతున్నట్లు టాక్. కంగనా రనౌత్ జయలలిత గా నటిస్తున్న ఈ మూవీలోని తన పాత్ర కోసం బాగా లావు అయి ఈ పాత్ర ద్వారా మరొకసారి జాతీయ అవార్డును పొందాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: