బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వం చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఇంకా అధికారిక టైటిల్ కూడా ప్రకటించని ఈ సినిమాపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న రాజమౌళి వచ్చే సంవత్సరం జులై నెలలో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికి డెభ్భై శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసర ఎవరు నటిస్తారనే విషయం నిన్ననే వెల్లడిచేసింది చిత్ర బృందం.

 

ఎన్టీఆర్ సరసన కథ ప్రకారం తెల్ల తోలు అమ్మాయి కావాలని వెతికారు. అయితే ఆ తెల్ల తోలు అమ్మాయిగా బ్రిటన్ కి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ ఒలివియా మోరిస్ ని ఎంపిక చేశారు. అయితే ఈమె ఇప్పటి వరకు ఒక్క హాలీవుడ్ ఫిలిమ్ లో కూడా నటించలేదు. అయినా ధైర్యం చేసి ఈమెని ఎందుకు ఎంచుకున్నారని చాలా మంది ఆలోచిస్తున్నారు. సినిమా విషయంలో ఎక్కడా రాజీపడని రాజమౌళి ఒలివియా మోరిస్ ని తీసుకోవడంపై ఏదో కారణం ఉంటుందని అనుకుంటున్నారు.

 

అయితే ఒలివియా మోరిస్ థియేటర్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు. మంచి డాన్సర్ కూడా. డాన్సర్ ని తీసుకోవడంతో ఈ సినిమాలో నృత్యానికి సంబంధించి ఏదైనా ప్రత్యేకత ఉంటుందని భావిస్తున్నారు. ఊరికే రాజమౌళి నిర్ణయాలు తీసుకోడు కాబట్టి ఒలివియా మోరిస్ ని తీసుకోవడం సినిమాకి మంచే చేస్తుందని, అందువల్లే రాజమౌళి ఆ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు.  ఏది ఏమైనా ఇప్పటి వరకు రాజమౌళి తీసుకున్న నిర్ణయం వల్ల చెడు జరిగినట్లు లేదు. 

 

ఒలివియా మోరిస్ తో పాటు సినిమాలో ప్రధాన విలన్లను కూడా పరిచయం చేశాడు రాజమౌళి. భారతీయులపై పెత్తనం చేసే బ్రిటిష్ అధికారి గా రే స్టీవెన్ సన్ అతని భార్యగా అలిసన్ డూడి ని ప్రకటించడం జరిగింది. రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి లు సీనియర్ నటులు కావడంతో పాటు హాలీవుడ్ లో కొన్ని ప్రముఖ చిత్రాలలో నటించారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: