ఈ మద్య సినీ పరిశ్రమలో వరుసగా బయోపిక్ మూవీస్ వస్తున్నాయి.  తెలుగు లో మహానటి, యాత్ర, ఎన్టీఆర్ బయోక్ లు వచ్చాయి. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీలో 40 ఏళ్ల క్రితం హత్యకు గురైన విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా  'జార్జిరెడ్డి' మూవీ తెరకెక్కించారు దర్శకుడు జీవన్‌రెడ్డి అన్నారు. ఇక తమిళ నాట రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించి అందరిచేత అమ్మ అని పిలిపించుకున్న నటి, నాయకురాలు జయలలిత జీవిత కథ ఆధారంగా పలు బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి. 

 


తాజాగా తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ‘తలైవి’ అనే టైటిల్ తో అమ్మ బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్‌.సింగ్ నిర్మిస్తున్న ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది. ఇప్పటి కే ఈ మూవీకి సంబంధించిన లోగో కూడా రిలీజ్ చేశారు.  అయితే తెలుగులో మంచి నటిగా కొనసాగిన జయలలిత తర్వాత తమిళంలో కూడా తన సత్తా చాటింది.  ఇదే సమయంలో ప్రముఖ నటులు ఎంజీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జయలలిత ఆయన రాజకీయ వారసురాలిగా అన్నాడీఎంకే బాధ్యతలు స్వీకరించారు.  

 


ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన ఆమె ప్రజలకు ఉపయోగపడే పథకాలు అమలు చేశారు.  ఆ మద్య అనారోగ్యంతో కన్నుమూసిన జయలలిత జీవితంలో ఎన్నో సంఘటనలు వెలుగు లోకి తెచ్చేందుకు ఈ మూవీ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ‘తలైవి’ అనే టైటిల్ తో అమ్మ బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్‌.సింగ్ నిర్మిస్తున్న ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది.  తెలుగు సినీ పరిశ్రమలో జయలలితో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ లో నటించిన నటసార్వభౌములు ఎన్టీఆర్ కూడా కనిపించబోతున్నారట.  

 


తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటించే అవకాశం ఉందంటున్నారు. బాలయ్యకు ముందు ఆ పాత్ర జూనియర్ ఎన్టీఆర్ ని సంప్రదించగా ప్రస్తుతం తాను రాజమౌళి తెరకెక్కించే ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్ బిజీలో ఉండటం వల్ల సున్నితంగా తీరస్కరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ బాలయ్యను సంప్రదించినట్లు తెలుస్తుంది. బాలయ్య గనక ఒప్పుకుంటే..మరోసారి తన తండ్రి పాత్రలో కనిపించే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: