రాజమౌళి సినిమాలో ఛాన్స్ రావడం అంటే అది మాములు విషయం కాదు. అదికూడా ఓ క్రేజీ మల్టీస్టారర్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా అవకాశం దక్కించుకోవడానికి చాలా అదృష్టం ఉండాలి. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా లక్కీ ఛాన్స్ అందుకుంది ఒలివియా మోరిస్. లండన్ లో థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఆమె పలు టివి సీరీస్ లలో నటిస్తుంది. సినిమాలో జెన్నిఫర్ పాత్రలో ఒలివియా నటిస్తుందని నిన్న ఆర్.ఆర్.ఆర్ యూనిట్ ఎనౌన్స్ చేశారు.

 

అయితే ఇలా ఎనౌన్స్ చేశారో లేదో గూగుల్ లో ఒలివియా మోరిస్ గురించి వెతకడం మొదలు పెట్టారు సిని లవర్. ఆ దెబ్బతో నిన్న గూగుల్ లో సెర్చ్ చేసిన వారిలో ఒలివియా మోరిస్ టాప్ 1లో నిలిచింది. కేవలం సినిమాలో ఆమె పేరుని ఎనౌన్స్ చేస్తేనే ఈ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది అంటే ఇక సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. సినిమాలో రాం చరణ్ అల్లూరి సీతారామరాజుగా, తారక్ కొమరం భీం గా నటిస్తున్నారు.

 

ఆల్రెడీ అల్లూరి సీతారామరాజుకి జోడీగా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అలియా భట్ ను సెలెక్ట్ చేశారు. ఇక ఇప్పుడు సెకండ్ హీరోయిన్ గా ఒలివియాను ఎంపిక చేశారు. అయితే ఆర్.ఆర్.ఆర్ లో తారక్ కు జోడీగా ముందు డైసీ ఎడ్గర్ జోన్స్ ను అనుకున్నారు. ఆమెని ఎనౌన్స్ చేసిన టైం లో కూడా గూగుల్ లో ఆమె గురించి బాగా వెతికారు. అయితే డేట్స్ అడ్జెస్ట్ చేయలేక ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు.

 

ఒలివియా మోరిస్ ఆర్.ఆర్.ఆర్ లో సెకండ్ హీరోయిన్ గా నటించనుంది. ఇక ఈ సినిమాలో విలన్స్ గా రే స్టీవెన్ సన్ స్కాట్ పాత్రలో నటిస్తుండగా లేడీ విలన్ గా అలిసన్ డూడీ నటిస్తున్నారు. సినిమాలో హాలీవుడ్ నటులను పెట్టి ఆర్.ఆర్.ఆర్ పై మరింత అంచనాలు పెంచాడు రాజమౌళి. ఇక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాను 10 భాషల్లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. మొత్తానికి ఆర్.ఆర్.ఆర్ కచ్చితంగా మరోసారి తెలుగు సినిమా స్థాయిని.. స్టామినాని చూపించేలా ఉంటుందని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: