యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వచ్చిన సినిమా అశోక్. 2006లో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. అయితే ఈ సినిమా విషయంలో సురేందర్ రెడ్డి ఈమధ్య చేసిన కామెంట్స్ నందమూరి ఫ్యాన్స్ అగ్గిమీద గుగ్గీలు అయ్యేలా చేసింది. అతనొక్కడే హిట్ అయిన తర్వాత అసలైతే ప్రభాస్ తో సినిమా ప్లానింగ్ లో ఉన్న సురేందర్ రెడ్డిని ఎన్.టి.ఆర్ మేనేజర్ అశోక్ చేయమని చెప్పాడట.

 

సినిమా చేయడం ఇష్టం లేకపోయినా సరే చేయాల్సి వచ్చిందని అన్నాడు సురేందర్ రెడ్డి. ఎప్పుడో 13 ఏళ్ల క్రితం జరిగిన మ్యాటర్ అసలు సురేందర్ రెడ్డి ఇప్పుడు ఎందుకు తవ్వుకోవాల్సి వచ్చింది. సైరా హిట్ తో తన సత్తా చాటిన సూరి మీద నందమూరి ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. కేవలం కావాలనే సురేందర్ రెడ్డి తారక్ మేనేజర్ మీద కామెంట్స్ చేశాడని ఫైర్ అవుతున్నారు.

  

అశోక్ పోయింది కాబట్టే ఊసరవెల్లి ఛాన్స్ ఇచ్చాడని.. ఆ కృతజ్ఞత సురేందర్ రెడ్డికి లేదని నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే సురేందర్ రెడ్డి అశోక్ సినిమా గురించి ఎన్.టి.ఆర్ మేనేజర్ గురించి చేసిన కామెంట్స్ ను యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ లైట్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అసలు ఈ కామెంట్స్ తారక్ దాకా వెళ్లాయా లేదా అన్న డౌట్ వచ్చినా ఎవరో ఒకరి ద్వారా సూరి విమర్శలు విన్నా తారక్ వాటిని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా లైట్ తీసుకున్నాడట. 

 

ఆర్.ఆర్.ఆర్ సినిమా కోసం పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడుతున్నారు తారక్ అండ్ చరణ్. అందుకే తన మీద ఎలాంటి రూమర్స్ వచ్చినా వారు స్పందించేలా లేరు. బాహుబలిని మించే సినిమాగా ఆర్.ఆర్.ఆర్ ను నిలబెట్టాలన్న బలమైన సంకల్పంతో ఈ సినిమా చేస్తున్నారు. మరి అది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: