కార్తికేయ హీరోగా నేహా సోలంకి హీరోయినగా నూతన దర్శకుడు  యెర్రా శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం  90 ఎమ్ ఎల్. అశోక్ గుమ్మకొండ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ ఏడాది కార్తికేయ నుండి వస్తున్న మూడవ చిత్రం ఇది. ఇప్పటి వరకు వచ్చిన రెండు చిత్రాలు పెద్దగా విజయం సాధించలేదు. ఈ సినిమాపై బాగా నమ్మకం పెట్టుకున్నాడు. 

 

యూత్ ని టార్గెట్ చేసి సినిమాకి  90 ఎమ్ ఎల్ అని పేరు కూడా పెట్టుకున్నాడు. అయితే కార్తికేయకి హిప్పీ సినిమా ఫ్లాప్ ప్రభావం బాగా పడింది. ఆ తర్వాత వచ్చిన గుణ 369 సినిమా కూడా ఏమంత విజయం సాధింలేదు. నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా చేసినప్పటికీ చెప్పుకోదగ్గ పేరు రాలేదు. దాంతో మొదటి సినిమా అయిన ఆర్ ఎక్స్ 100 సినిమాలోలాగా తాగుడుకి బానిసయ్యే పాత్ర ద్వారా మనల్ని మరోసారి పలకరించబోతున్నాడు.

 

ఈ మేరకు చిత్ర ట్రైలర్ ఈరోజే రిలీజైంది. కామెడీ, యాక్షన్ మరియు ఎమోషన్స్ కలగలిసి మూవీ ట్రైలర్ ఎంటర్టైనింగ్ గా సాగింది. ఆరోగ్య రీత్యా హీరోకి మూడు పూట్లా మూడు 90ఎంఎల్ ఆల్కహాల్ అవసరం కాగా, అసలు ఆల్కహాలంటేనే గిట్టని ఫ్యామిలీ లో పుట్టిన అమ్మాయిగా హీరోయిన్ కనిపిస్తుంది. మరి వీరిద్దరి ప్రేమకు ఎదురయ్యే సమస్యలే ఈ మూవీ ప్రధాన కథ అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. 

 

మరి అతని తాగుడు తన ప్రేమని  ఎలా అడ్డుపడబోతుందో తెలుసుకోవాలంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రం కార్తికేయ కెరిర్ ని మలుపు  తిప్పుతుందా లేదా చూడాలి. ఈ సినిమా విజయం మీదే అతని భవిష్యత్తు ఆధారపడి ఉందనేది మాత్రం వాస్తవం. 

మరింత సమాచారం తెలుసుకోండి: