1970వ దశకంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రభంజనం సృష్టించిన విద్యార్థి నేత జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా దర్శకుడు జీవన్ రెడ్డి ‘జార్జిరెడ్డి ’ మూవీ తెరకెక్కించారు.  25 ఏళ్లకే విద్యార్థి నాయకుడిగా ఎదిగి, ఎందరికో స్ఫూర్తి దాయకంగా మారిన జార్జిరెడ్డి జీవితాన్ని ఆధారం చేసుకుని తెరకెక్కిన మూవీ ‘జార్జిరెడ్డి’. జీవన్‌రెడ్డి దర్శకుడు.   అప్పట్లోనే టాప్ ర్యాంకర్ గా నిలిచి అత్యున్నతమైన ఉద్యోగాలు..అవకాశాలు వచ్చినా కాదనుకొని తనకు ఉస్మానియా యూనివర్సిటే ఇష్టం అనుకొని ఇక్కడ విద్యనభ్యసించారు.  అదే సమయంలో విద్యార్థులపై జరుగుతున్న ర్యాగింగ్ పై తిరుగుబాటు చేశాడు.  ఉన్నత వర్గం అణగారిన వర్గాలపై చేస్తున్న పెత్తనాన్ని తిప్పి కొట్టాడు.

 

 తన ఉద్యమ స్ఫూర్తితో ఎంతో మంది విద్యార్థుల్లో చైతన్యం తీసుకు వచ్చాడు. ఒకసారి తనపై దారుణమై హత్యాయత్నం జరిగినా..లేక్క చేయకుండా తిరిగి మళ్లీ అందరికీ అండగా నిలిచి కొంత మంది దుష్టశక్తుల చేతిలో దారుణంగా హత్యగావింపబడ్డారు జార్జిరెడ్డి. నవంబర్‌ 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం ఈ చిత్రబృందం నారాయణగూడలోని క్రైస్తవ స్మశానవాటికలో జార్జ్‌రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించింది.   ఈ కార్యక్రమంలో హీరో సందీప్ మాధవ్, దర్శకుడు జీవన్ రెడ్డితో పాటు చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు. 

 

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ... నీతి, నిజాయతీని నిలువెల్లా నింపుకున్న విద్యార్థి నేత జార్జ్ రెడ్డి అని చెప్పారు. తన కోసం కాదు.. తన వాళ్ల కోసం అని ఎవరికి అన్యాయం జరిగినా నేను మీకు అండగా ఉన్నా అంటూ నమ్మకాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి అన్నారు.  ఈ సినిమా కోసం ఐదేళ్లు కష్టపడ్డానని తెలిపారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ మెట్లపై పడుకుని జార్జి రెడ్డి గుండె చప్పుడును తాను విన్నానని చెప్పారు. ఈ సినిమా హింసను ప్రేరేపించే విధంగా ఉంటుందన్న వాదనలో నిజం లేదని... అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించాలనే సందేశం ఉంటుందని తెలిపారు. ఈ సినిమాతో మళ్లీ జార్జిరెడ్డి పుడతాడని అన్నారు.  ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: