యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తోన్న తాజా చిత్రం రూల‌ర్‌. హ్యాపీ మూవీస్ ప‌తాకంపై సీ క‌ళ్యాణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు కోలీవుడ్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ కేఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బాల‌య్య స‌ర‌స‌న లెజెండ్‌, డిక్టేట‌ర్ బ్యూటీ సోనాల్ చౌహాన్‌తో పాటు మ‌రో హీరోయిన్‌గా వేదిక న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్‌, స్టిల్స్ చూస్తుంటే సినిమా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెలుస్తోంది.



ఇక గురువారం సాయంత్రం రూల‌ర్ టీజ‌ర్ రిలీజ్ అయ్యింది. 1.15 సెక‌న్ల పాటు ఉన్న టీజ‌ర్ చూస్తుంటే ప‌క్కా రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్‌గానే క‌నిపిస్తోంది. టీజ‌ర్ అంతా ఫైట్లు, యాక్ష‌న్ క‌ట్స్‌తో పాటు డైలాగులతోనే నింపేశారు. ఈ యేడాది త‌న తండ్రి ఎన్టీఆర్ బ‌యోపిక్‌లు అయిన మ‌హానాయ‌కుడు, క‌థా నాయ‌కుడు సినిమాల‌తో డిజాస్ట‌ర్లు కొట్టిన బాల‌య్య ఇప్పుడు మ‌ళ్లీ క‌మ‌ర్షియ‌ల్ బాట పట్టాడు.


సినిమాలో బాల‌య్య ముందుగా పోలీస్ ఆఫీస‌ర్ త‌ర్వాత గ్యాంగ్‌స్ట‌ర్‌గా మారి విల‌న్ల భ‌ర‌తం ప‌డ‌తాన‌డి అర్థ‌మ‌వుతోంది. ఇక సోనాల్ చౌహాన్ అందాల విందు బాగుంది. స్విమ్మింగ్ ఫూల్ నుంచి లేలేత త‌డి అందాలు చూపిస్తూ బ‌య‌ట‌కు వ‌స్తోన్న సీన్ మాస్ ప్రేక్ష‌కుల‌కు ర‌చ్చే. ఇక వారికి కావాల్సిన డైలాగులు, బాల‌య్య మార్క్ ఫైట్ల‌కు కూడా కొద‌వ‌ లేదు. సినిమాలో విల‌న్లు కూడా భ‌యంక‌రంగానే ఉన్నారు. మ‌రి వీరిని బాల‌య్య ఎలా రూల్ చేశాడో ?



జై సింహా సినిమాను ఎలా క‌మ‌ర్షియ‌ల్‌గా తీసి ర‌వికుమార్ హిట్ కొట్టాడో ఇప్పుడు రూల‌ర్‌ను కూడా అదే స్టైల్లో తీసేశాడు. ఇక టీజ‌ర్ చూస్తుంటే క‌థ‌, క‌థ‌నాలు కొత్త‌గా ఉంటాయ‌ని ఎంత మాత్రం ఆశించ‌లేం. అయితే బాల‌య్య స్టైల్లో సినిమా వాళ్ల అభిమానుల‌కు ఎక్కిందంటే మాత్రం సినిమా హిట్టే.. ఇక ఇప్పుడు సినిమా కోసం డిసెంబ‌ర్ 20 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే. మ‌రి బాల‌య్య రూల‌ర్‌గా బాక్సాఫీస్‌ను ఎలా రూల్ చేస్తాడో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: