కొన్ని రోజుల ముందు జార్జి రెడ్డి గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ప్రస్తుతం ఈ పేరు ట్రెండింగ్ లో ఉంది. దానికి కారణం జార్జి రెడీ జీవితం మీద వస్తున్న సినిమా. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి అయిమ జార్జి రెడ్డి గురించి సినిమా తీస్తున్నామని ప్రకటించినపుడు ఎక్కడ నుండి కూడా ఎలాంటి ప్రతిఘటన రాలేదు. కానీ సినిమా ట్రైలర్ విడుదల అయినప్పటి నుండి అందరి దృష్టి ఈ సినిమా మీద పడింది.

సినిమా ట్రైలర్ చాలా ఇంటెన్స్ గా కట్ చేశారు. ట్రైలర్ తో ప్రేక్షకులకి సినిమా మీద ఆసక్తి కలిగేలా చేయడంలో దర్శక నిర్మాతలు సక్సెస్ అయ్యారు. అయితే విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా మీద వివాదాలు కూడా మొదలయ్యాయి. ఒక వర్గానికి వ్యతిరేకంగా జార్జిరెడ్డి సినిమా ఉందనే ప్రచారం సాగుతోంది. అలాగే బీజేపీ అధికార విద్యార్థి సంఘం అయిన అఖిల భారత విద్యార్థి పరిషత్ కి వ్యతిరేకంగా ఈ సినిమా ఉంటుందనే వాదన కూడా వినిపిస్తుంది.

సినిమా ఎలా ఉందనేది ఇప్పుడే చెప్పలేం. కానీ ఇప్పట్లో ఈ సినిమాకి చాలా హైప్ వచ్చిది. చిన్న సినిమాల్లో ఈ సినిమాకి వచ్చినంత హైప్ మరే సినిమాకి రాలేదు. రేపు విడుదల అవబోతున్న ఈ సినిమా మీద ప్రతీ ఒక్కరికీ అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి ప్రముఖులు ఈ సినిమా గురించి, జార్జి రెడ్డి గురించి ప్రస్తావించడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు మీడియాతో మాట్లాడారు.


దర్శకుడు  మొదట జార్జ్ రెడ్డి కథను చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. రొటీన్ సినిమాలను కాకుండా ఇలాంటి సినిమాలు చేయడం వల్ల మంచి పేరు వస్తుందని భావించాము. కమర్షియల్ గా ఆలోచించకుండా డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని పక్కన పెట్టి ఈ సినిమాను తీశాం. సినిమా కోసం ఏకంగా ఉస్మానియా యూనివర్శిటీ సెట్ ను వేయడం జరిగింది. ఈ సినిమాలోఫ్ కథే హీరో కాబట్టి కొత్త వారైనా సరిపోతారని సందీప్ ని తీసుకున్నాం అని చెప్పారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: