ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల్లో స్టార్ హీరో సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదు. దీపావళి కానుకగా ఒక్క సినిమా కూడా లేకపోవడంతో తమిళ చిత్రాలు బాక్సాఫీసు వద్ద సందడి చేశాయి. అయితే వాటి సందడి దీపావళితోనే ముగిసిపోవడంతో తెలుగులో చిన్న సినిమాలు విడుదల అయ్యాయి. ఐతే వాటిలో ఏవీ అనుకున్నంతగా హిట్ కాలేదనే చెప్పాలి.  మరో నెల రోజుల వరకు పెద్ద సినిమాలేవి లేకపోవడంతో బాక్సాఫీసు వద్ద చిన్న సినిమాలు కుప్పలు కుప్పలుగా విడుదలవుతున్నాయి.

 

తెలుగులో రేపు మొత్తం ఆరు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో హాలీవుడ్ సినిమా అయిన ఫ్రోజెన్ తెలుగు వెర్షన్ కూడా ఉంది. స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చూస్తే 'రాగల 24 గంటల్లో'.. 'బీచ్ రోడ్ చేతన్'.. 'జార్జ్ రెడ్డి'.. 'తోలు బొమ్మలాట'.. 'జాక్ పాట్' ఉన్నాయి.  ఈ ఐదు సినిమాల్లో కాస్త క్రేజ్ ఉన్న సినిమా 'జార్జ్ రెడ్డి' మాత్రమే.  ఇంటెన్స్ ట్రైలర్ తో యూత్ ను ఆకర్షించిన ఈ సినిమాకు ఓపెనింగ్స్ బాగానే ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇక బీచ్ రోడ్ చేతన్ సినిమా మొదటి ఆటకి టికెట్లు ఫ్రీ అని ప్రకటించడంతో ఈ సినిమాకి జనాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

 

అయితే మొదటి షో పూర్తయితే గానీ ఈ షోకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చెప్పలేం. అయితే ఈ సినిమాలన్నింటికన్నా ఎక్కువ ఆసక్తిని కలుగజేసిన పాట ఒకటి ఉంది. అదే బన్నీ నటించిన "అల వైకుంఠపురములో" నుండి ఓ మై డాడీ. ఈ పాట ప్రోమోని బాల దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. అప్పటి నుండి ఈ పాటపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. థమన్ సంగీతం అందిస్తున్న ఈ పాట కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు.  మరి ఈ పాట కూడా విడుదలైన రెండు పాటల్లాగా హిట్ అవుతుండో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: