టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ చెప్పారు. ఛాన్స్ ల పేరుతో అమ్మాయిలను వాడుకుంటున్నారని దీనిపై పొరాటం జరుగుతునే ఉంది. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అనుకునేవారికి ఛాన్సులు రావడం లేదు. అయితే పడకగదిలోకి వస్తేనే ఛాన్సులు ఇస్తామని కొందరు అంటున్నారని శ్రీ రెడ్డి లాంటి వాళ్ళు గొంతెత్తి అరిచారు. ‘మీటూ’ అంటూ ఎన్నో ఉద్యమాలు కూడా చేశారు. ఇది ఇలా ఉంటే తాజాగా హీరోయిన్ మాధవీ లత క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించింది. తనీష్ ‘నచ్చావులే’, నాని ‘స్నేహితుడా’ చిత్రాల్లో హీరోయిన్ గా చేసిన ఈమె.. మహేష్ బాబు అతిథి సినిమాలో కీలకపాత్రలో కనిపించింది. తర్వాత ఈ భామకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక 2019 ఎన్నికల్లో పాల్గొంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మధవీలత మాట్లాడుతూ.. ”కమిట్మెంట్ అనేది చాలా పవిత్రమైన పదం. కానీ దాన్ని సినీ పరిశ్రమలో మనోళ్లు ఇలా మార్చేశారు. కమిట్మెంట్ అంటే ఇప్పుడు పడుకోవడం అనే అర్ధానికి దిగజార్చారు. వాస్తవానికి కమిట్మెంట్ అంటే ఒప్పుకున్న పని కంప్లీట్ చేయడం. కానీ ఇక్కడ మాత్రం కమిట్మెంట్ అంటే పడుకోవడానికి రెఢీ అన్నట్లు మార్చేశారు. నాకు ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పట్లో నన్ను కమిట్మెంట్ అడిగారు. అయితే అందుకు నేను ఒప్పుకోలేదు. పడకగదిలోకి వెళ్లకుంటే ఎవరూ మన టాలెంట్ ను గుర్తించరు” అని మాధవిలత చెప్పుకొచ్చింది.

 

అంతేకాదు స్క్రీన్ మీద హీరోలుగా కనిపించే వారంతా రియల్ లైఫ్ లో హీరోలు కాలేరని.. కేవలం కొంతమంది మాత్రమే అలా ఉంటారని అన్నది. ఇక బాలీవుడ్ లో తనూ శ్రీ దత్తా సైతం గతంలో ప్రముఖ నటులు నానా పటేకర్ తనపై లైంగికంగా వేధించారని సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా ద‌ర్శక నిర్మాతల పడకగదికి వస్తే కానీ ఇక్కడ అవకాశాలు అంత ఈజీగా రావని.. వాళ్ల కోరిక తీరిస్తే కానీ తమ టాలెంట్ వాళ్లకు కనిపించదని సంచలన వ్యాఖ్యలు చేసింది నటి మాధవిలత. గతంలో కాస్టింగ్ కౌచ్ ఉద్యమం జరుగుతున్న సమయంలో మాధవీ లత ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ లో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత మరోసారి తెరపైకి వచ్చింది ఈ అమ్మడు.

మరింత సమాచారం తెలుసుకోండి: