వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా టీజర్ మరియు సినిమాకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాపై రాజకీయ రంగాలలో మరియు సినిమారంగంలో అనేక కామెంట్లు వినపడుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో జరిగిన వాతావరణాన్ని యధావిధిగా చూపిస్తూ జగన్ అధికారంలోకి వచ్చాక జరిగిన అసెంబ్లీ సమావేశాలలో జరిగిన సంభాషణలను ప్రేక్షకులను రక్తికట్టించే విధంగా తెరకెక్కించారు...డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ముఖ్యంగా టైటిల్ ని చాలా వెరైటీగా ఆలోచించి పెట్టి రగడ సృష్టించిన రాంగోపాల్ వర్మ సినిమాకి సంబంధించిన పాత్రధారులకు సంబంధించిన ఒక ఫోటో ని విడుదల చేసి సోషల్ మీడియాలో మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాకి అదిరిపోయే ప్రమోషన్ వివాదాల రూపంలో తీసుకువస్తూ ఈనెల 29వ తారీఖున సినిమాని విడుదల చేయడానికి రామ్ గోపాల్ వర్మ రెడీ అవుతున్నరూ.

 

ఇదిలా ఉండగా ఈ సినిమాలో తనని అవమానించారని తన పాత్రని అవమానకరంగా చిత్రీకరించారు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కే ఏ పాల్ రాంగోపాల్ వర్మ నీ  కోర్టు మెట్ల ఎక్కించటం కోసం రెడీ అయినట్లు ఇందుకోసం హైకోర్టులో రాంగోపాల్ వర్మ పై పిటిషన్ వేయటానికి అలాగే సినిమాని ఆపేయాలని కె ఏ పాల్ డిసైడ్ అయినట్లు సమాచారం.

 

ఈ పిటీషన్‌లో ప్రతివాదులుగా సెన్సార్ బోర్డ్, కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ, రామ్‌గోపాల్‌ వర్మ, జబర్దస్త్‌ కమెడియన్‌ రాము తదితరులను చేర్చారు. అంతేకాకుండా ఈ సినిమాలో నారా లోకేష్ పాత్ర మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాత్రలను కూడా రామ్ గోపాల్ వర్మ చూపిస్తున్న నేపథ్యంలో సినిమా పై రకరకాల కామెంట్లు ఇంకా వినబడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: