రకుల్ ప్రీత్ సింగ్... ఈ పంజాబీ పిల్ల తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టి కుర్రకారు మనసులను దోచేసుకుంది. తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే పెద్ద పెద్ద స్టార్ హీరోస్ తో నటించింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఆమె నటించిన ప్రతి ఒక్క తెలుగు చిత్రం అంతగా విజయం సాధించకపోవడంతో తనకి టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు సన్నగిల్లిపోయాయి. ఇటీవల వచ్చిన మన్మధుడు 2 సినిమా కూడా విజయం సాధించలేకపోవడంతో ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీని వదులుకొని.. బాలీవుడ్ లో తన సినీ జీవితాన్ని పరీక్షించుకోవాలనే ఉద్దేశంతో 'దే దే ప్యార్ దే' సినిమా ప్రాజెక్టును ఒప్పుకుంది. అయితే ఈ సమయంలోనే రకుల్ ప్రీత్ కు.. విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం సినిమాలో హీరోయిన్ గా నటించమని ఆ చిత్ర బృందం ఆఫర్ ఇచ్చింది.


అప్పటికే ఆమె ఒక బాలీవుడ్ సినిమా ప్రాజెక్టుకు ఒప్పుకుంది కాబట్టి  గీత గోవిందం సినిమాకి డేట్స్ దొరకక వదులుకోవాల్సి వచ్చిందని రకుల్ ప్రీత్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. గీత గోవిందం సినిమా ఒక పెద్ద హిట్ అవడంతో.. తాను ఈ సినిమాలో ఒక చిన్న పాత్రయినా చేసినట్లయితే బాగుండేది అంటూ ఎంతో పశ్చాత్తాపడింది.

ఇదే ఇంటర్వ్యూలో.. 'మీతో నటించిన హీరోస్ లలో మిమ్మల్ని ఎవరైనా సెక్స్ కావాలని అడిగారా?' అని ప్రశ్నించినప్పుడు.... 'హా! అవును అడిగారు' అంటూ సంచలన వ్యాఖ్య చేసింది. ఓ స్టార్ హీరో తనని సెక్స్ కావాలని అడిగాడు కానీ మర్యాదపూర్వకంగానే అడిగాడని చెప్పుకొచ్చింది ఈ పంజాబీ ముద్దుగుమ్మ. అయితే తనకు ఇష్టం లేదని సున్నితంగా ఈ సెక్స్ ప్రపోజల్ ని నిరాకరించినట్లు రకుల్ వెల్లడించింది. ఇంత చెప్పిన రకుల్... అతని పేరు మాత్రం బయట పెట్టలేదు. కానీ నెటిజన్లు మాత్రం... ఆ హీరో ఎవరబ్బా అంటూ చర్చించుకుంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: