టాలీవుడ్ హాట్ బ్యూటీ.. స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతుంది బాలీవుడ్ భామ రకూల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ప్రస్తుతం యంగ్ స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ అమ్మడు ఈ మద్య కింగ్ నాగార్జున తో సైతం నటించింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తున్న రకూల్ ప్రీత్ సింగ్ కొంత కాలంగా తెలుగు లో ఆఫర్స్ తగ్గడంతో కోలీవుడ్, బాలీవుడ్ లో ఎక్కువ నటిస్తుంది.  


వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ రకూల్ కి మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ధృవ’ మూవీతో మరో హిట్ అందుకున్న రకూల్ వరుసగా టాప్ హీరోల సరసన నటించింది. ఈ మద్య సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్, మీ టూ ఉద్యమాలు జరుగుతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో పలువురు హీరోయిన్లు, ఇతర సాంకేతిక వర్గాని చెందిన వారు గతంలో ఇండస్ట్రీలో తమపై జరిగిన లైంగిక దాడుల గురించి గళమెత్తారు. ఇదే సమయంలో కొందరు మంచివాళ్లు కూడా ఇండస్ట్రీలో ఉన్నారంటూ వాళ్లే చెప్తున్నారు కూడా. 


తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటి రకూల్ ప్రీత్ సింగ్ గతంలో తనకు జరిగిన చేదు అనుభవం గురించి చెప్పారు. సినీ పరిశ్రమలో కొన్ని ఇబ్బందులు అయితే వచ్చాయని.. లేదని అబద్ధం మాత్రం చెప్పనని చెబుతుంది.  తనను ఓ స్టార్ హీరో సెక్స్ కోసం అడిగాడని చెప్పి షాక్ ఇచ్చింది.  సిని పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో ఓ హీరో మాత్రం తన దగ్గరికి ఈ ప్రపోజల్ తీసుకొచ్చాడని.. తనతో లైంగికంగా కలవాలని అది కూడా అసభ్యంగా అడగకుండా చాలా మర్యాదపూర్వకంగానే తన ప్రపోజల్ తీసుకొచ్చాడని.. అది విన్నపుడు కోపం అనిపించినా ఆ తర్వాత తాను కూడా కూల్‌గా అలాంటివి తన దగ్గర చెల్లవని చెప్పినట్లు తెలిపింది రకుల్.  అయితే రకూల్ ని  సెక్స్ కోసం ప్రపోజ్ చేసిన హీరో ఎవరా అన్న విషయం చాలా సీక్రెట్ గా దాచింది ఈ ముద్దుగుమ్మ. 

మరింత సమాచారం తెలుసుకోండి: