అప్పట్లో 90లలో వచ్చిన హాలీవుడ్ ప్రేమ కథ చిత్రం టైటానిక్ అప్పట్లో అనేక రికార్డులను సృష్టించింది. ముఖ్యంగా ప్రపంచంలో మొట్టమొదటి వెయ్యి కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా ఈ సినిమా రికార్డు సృష్టించింది. సినిమాలో హీరోగా నటించిన  లియోనార్డో డికాప్రియో కి మంచి ఆదరణ ప్రపంచవ్యాప్తంగా దక్కడంతో పాటు మంచి క్రేజ్ కూడా ఏర్పడింది. టైటానిక్ సినిమా ఇచ్చిన విజయంతో ఇప్పటిదాకా హాలీవుడ్ ఇండస్ట్రీలలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోలలో టాప్ టెన్ లో ఉంటూ ఎప్పటికప్పుడు సినిమాలు చేస్తూ మంచి ఆదరణ దక్కించుకుంటూ కెరియర్ కొనసాగిస్తున్నారు.

 

కేవలం నటనలో మాత్రమే కాకుండా మానవత్వం లో సమాజానికి ఉపయోగపడుతూ మానవత్వం కలిగిన వ్యక్తిగా ప్రకృతి ప్రేమికుడిగా లియోనార్డో డికాప్రియో మంచి ప్రశంసలు అందుకున్నారు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో ఢిల్లీ ప్రజలు పడుతున్న బాధకు కరిగిపోయారు. విషయంలోకి వెళితే ఇటీవల ఢిల్లీవాసులు పలు పర్యావరణ పరిరక్షక సంస్థల ఆధ్వర్యంలో ఇండియా గేట్ వద్ద చేరి నిరసన తెలియజేశారు. కాలుష్యాన్ని తగ్గించేలా చర్యలు చెప్పట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో అన్ని ఏజ్ గ్రూపుల ప్రజలు పాల్గొనడం విశేషం. వారి నిరసన కార్యక్రమం డికాప్రియోని కదిలించింది. తన సోషల్ మీడియా వేదికగా డికాప్రియో ఢిల్లీ కాలుష్యం గురించి పోస్ట్ పెట్టి వివరాలన్నీ తెలియజేశాడు.

 

డికాప్రియో ఈ పోస్ట్ లో తెలుపుతూ.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం ఢిల్లీలో ప్రతి ఏటా 15 లక్షల మంది ప్రజలు కాలుష్య సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారు. ప్రపంచంలో పొల్యూషన్ ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానంలో ఉంది...కనుక భారత్ లో ఉన్న ప్రభుత్వం వెంటనే భారతీయుల ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకొని పర్యావరణాన్ని కాపాడుతూ కాలుష్యాన్ని అరికట్టాలని భారత ప్రభుత్వం వెంటనే స్పందించాలి అంటూ లియోనార్డో డికాప్రియో కోరారు. దీంతో ఢిల్లీ వాసులు తమపట్ల టైటానిక్ హీరో చూపెడుతున్న మానవత్వానికి సోషల్ మీడియా లో పెట్టిన పోస్ట్ కి ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: