నవంబర్ 20వ తేదీ తెల్లవారుజామున ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు నివాసంలోను, కార్యాలయంలోను, రామానాయుడు స్టూడియోస్ లోను ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రముఖ హీరో నాని నివాసంలో, కార్యాలయంలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సురేశ్ బాబు, నాని ఇళ్లలో సోదాలు జరగటంపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
 
సోషల్ మీడియాలో శ్రీరెడ్డి ఐటీ దాడులు చేసిన ఆఫీసర్లు, చేయించిన ఆఫీసర్లు చేసిన సహాయాన్ని మరిచిపోలేనని పోస్ట్ చేసింది. శ్రీరెడ్డి నాని, సురేశ్ బాబు ఇళ్లపై దాడులు జరిగితే ఇలా వ్యాఖ్యలు చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. గతంలో శ్రీరెడ్డి సురేశ్ బాబు చిన్న కొడుకుపై కొన్ని ఆరోపణలు చేయండి . ఒక టీవీ ఛానెల్ లో శ్రీరెడ్డి సురేశ్ బాబు కొడుకుతో క్లోజ్ గా ఉన్న ఫోటోలను బయట పెట్టింది. 
 
నేచురల్ స్టార్ నానిపై కూడా శ్రీరెడ్డి గతంలో సంచలన ఆరోపణలు చేసింది. దేవుడు ఉన్నాడు సురేశ్ బాబు గారు అని కూడా సోషల్ మీడియాలో శ్రీరెడ్డి పోస్ట్ చేసింది. మరోవైపు కొన్ని రోజుల క్రితం తమిళనాడులో మీడియా సమావేశం నిర్వహించింది. ప్రముఖ నటుడు ఉదయనిధి గురించి శ్రీరెడ్డి కామెంట్లు చేస్తున్నట్లు వస్తున్న వార్తల గురించి స్పందించింది. ఉదయనిధిని నేను ఎప్పుడూ చూడలేదని ఎవరో ఫేక్ అకౌంట్ నుండి పోస్ట్ చేశారని శ్రీరెడ్డి చెప్పింది. 
 
త్వరలో తమిళనాడు రాజకీయాల్లోకి కూడా రాబోతున్నట్లు శ్రీరెడ్డి ప్రకటన చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీరెడ్డి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. శ్రీరెడ్డి ఏ పార్టీలో చేరబోతుంది అనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. తమిళనాడు ప్రజలు తనను ఆదరిస్తారనే నమ్మకం తనకుందని శ్రీరెడ్డి తెలిపింది. ప్రముఖ హీరో నాగార్జున నివాసం, అన్నపూర్ణ స్టూడియోస్ లో కూడా నవంబర్ 20వ తేదీన ఐటీ రైట్స్ జరిగాయని తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: