టాలీవుడ్ లో లక్కీ కాంబినేషన్స్ గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా ఆసక్తికరంగానే ఉంటుంది. హిట్ కాంబినేషన్ అంటే ముఖ్యంగా డైరెక్టర్-హీరో గురించి మాట్లాడుకుంటాము. అలాగే హీరో-హీరోయిన్ కాంబినేషన్ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక హీరో-హీరోయిన్ కాంబినేషన్ లో వరుసగా రెండు సినిమాలు హిట్ అయితే చాలు..ఇక ఎక్కువ మంది దర్శక, నిర్మాతలు వాళ్ళిద్దరిని పెట్టి సినిమాలు తీయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక ఆ తర్వాత మాట్లాడుకోవాల్సింది డైరెక్టర్-మ్యూజిక్ డైరెక్టర్ గురించి. కొందరు దర్శకులు ఒకే మ్యూజిక్ డైరెక్టర్ తో వర్క్ చేస్తూ తమ బాండింగ్ తో బెస్ట్ అవుట్ పుట్ ని రాబడుతుంటారు. ఆ లిస్టులో ముందుగా ఎస్.ఎస్.రాజమౌళి -కీరవాణి గురించి చెప్పుకోవాలి. ఆ తర్వార సుకుమార్ -దేవి శ్రీ ప్రసాద్ గురించి చెప్పొచ్చు. ఆర్య సినిమా నుండి వీళ్ళిద్దరి కాంబోలో చాలానే మ్యూజికల్ హిట్స్ వచ్చాయి.. అయితే ఇప్పుడీ లిస్టులో నుండి ఇద్దరు దర్శకులు తమ రూట్ మార్చేసారు.

ఇప్పటి వరకు దేవి శ్రీ ప్రసాద్ లేకుండా కొరటాల శివ సినిమా చేయలేదు. మిర్చి నుండి భరత్ అనే నేను వరకు చేసిన నాలుగు సినిమాలకు దేవినే మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకొని బెస్ట్ ఆల్బమ్స్ రాబట్టుకున్నాడు కొరటాల. ఓ ఇంటర్వ్యూ లో కూడా తనకి మ్యూజిక్ గురించి ఏం తెలియదని అందుకే మ్యూజిక్ లో బెస్ట్ అయిన దేవినే కంటిన్యూ చేస్తున్నానని కొరటాల చెప్పిన సందర్భం కూడా ఉంది. అయితే సడన్ గా దేవీ ని కాదని ఇప్పుడు చిరు సినిమాకు మణిశర్మను ఫైనల్ చేసుకున్నారు. 

ఇక దేవిని కంటిన్యూ గా రిపీట్ చేసే మరో దర్శకుడు కిషోర్ తిరుమల కూడా ఈ సారి 'రెడ్' సినిమాకు దేవి ని కాదని మణిశర్మనే తీసుకున్నాడు. అయితే ఇందులో కిషోర్ నిర్ణయం కంటే రామ్ రవి కిషోర్ ల నిర్ణయమే ఫైనల్ అన్న విషయం తెలిసిందే. తనకి ఇస్మార్ట్ శంకర్ లాంటి బెస్ట్ ఆల్బం అందించడం పైగా రెడ్ బాగ్రౌండ్ స్కోర్ కి ఎంతో ఇంపార్టెన్స్ ఉండే క్రైం థ్రిల్లర్ బ్యాగ్డ్రాప్ కథ కాబట్టి.. దేవిని కాదని మణిశర్మ ని పెట్టుకున్నారు మేకర్స్. సో ఇలా ఈ రెండు సినిమాలకు దేవిని కాదని తనకి మ్యూజిక్ నేరిన గురువు మణిశర్మకి చాన్స్ ఇచ్చారు. మరి మణిశర్మ ఈ రెండు సినిమాలకి ఎలాంటి అవుట్ పుట్ ఇస్తారో చూడాలి. ఒక వేళ ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ ఐతే ఇక మళ్ళీ మణిశర్మ ఒక ఊపు ఊపడం ఖాయమని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.  అయితే చిరు సినిమాకి మ్యూజిక్ అందించే ఛాన్స్ మిస్సవడంతో అన్నయ్య మెగాస్టారే.. తమ్ముడు దేవి శ్రీ ప్రసాద్ కి గట్టి షాకిచ్చాడని కౌంటర్ వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: