టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఏ మాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత రూత్ ప్రభు, తొలిసినిమాతోనే సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ తో దూకుడు, ఎన్టీఆర్ తో బృందావనం వంటి సూపర్ హిట్స్ ని అందుకున్న ఈ టాలీవుడ్ ముద్దుగుమ్మ, అనంతరం వరుసగా పలు టాలీవుడ్ బడా సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంది. దానితో పాటు కోలీవుడ్ లో కూడా రాణించిన సమంత, ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా కొనసాగుతున్నారు. 

 

ఇటీవల నాగచైతన్యను వివాహం చేసుకుని అక్కినేని వారి కోడలు అయిన సమంత, ప్రస్తుతం మాత్రం చాలా సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఇక తన కెరీర్ లో ఎక్కువశాతం విజయాలు తన ఖాతాలో వేసుకున్న సమంత, ఇటీవల తమిళ్ లో రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టిన 96 మూవీ తెలుగు రీమేక్ లో శర్వానంద్ సరసన ప్రస్తుతం నటిస్తోంది. ఇకపోతే తన వ్యక్తిగత మరియు సినిమా విషయాలు ఫ్యాన్స్ తో షేర్ చేసుకునే సమంత, కాసేపటి క్రితం తన సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక షాకింగ్ పోస్ట్ పెట్టింది. 

 

తన భర్త నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకు సంబంధించి నాగచైతన్య ఫస్ట్ లుక్ పోస్టర్ ని నిన్న రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఆ పోస్టర్ లో నాగచైతన్య ఎంతో ఉత్సాహంగా నవ్వుతూ కనపతున్నారు. అయితే ఆ ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్యాగ్ చేసిన సమంత, ఈ నవ్వు కోసం చచ్చిపోతాను అంటూ ప్రేమతో కూడిన ఎమోజిని భర్త చైతన్య పై సరదాగా ఒక పోస్ట్ చేసింది. కాగా భర్తపై తనకున్న ప్రేమతో ఆమె పెట్టిన పోస్టుకు పలువురు ఆమె అభిమానులు పొగడ్తలు కురిపిస్తూ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: