పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అంతకముందు కొన్ని సినిమాల్లో పలు చిన్న పాత్రల్లో నటించడం జరిగింది. అయితే పూర్తి స్థాయి హీరోగా ఆయన మారి నటించింది మాత్రం పెళ్లిచూపులు సినిమా ద్వారానే అని చెప్పాలి. కాగా ఫస్ట్ సినిమాతో బెస్ట్ సక్సెస్ ని అందుకున్న విజయ్, ఆ తరువాత అర్జున్ రెడ్డి సూపర్ డూపర్ హిట్ తో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. ఆ తరువాత వచ్చిన గీత గోవిందం సినిమా మరింత సక్సెస్ సాధించి కెరీర్ పరంగా విజయ్ క్రేజ్ ని అమాంతం పెంచేసింది. అయితే ఆ తరువాత నుండి పెద్దగా సక్సెస్ అందుకోని విజయ్, ప్రస్తుతం రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. 

 

ఇకపోతే ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఇటీవల దొరసాని సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. రాజశేఖర్ మరియు జీవితల తనయ శివాత్మిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా మాత్రం పెద్దగా సక్సెస్ కాలేదు. దానితో తన తదుపరి సినిమా విషయమై కొంత ఆలోచన చేస్తున్న ఆనంద్ కు ఇటీవల ఒక యువ డైరెక్టర్ వచ్చి కలిసి, కొన్నేళ్ల క్రితం శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన తాళి అనే సినిమా రీమేక్ లో నటించాల్సిందిగా కోరాడట. అప్పట్లో ఆ సినిమా బాగానే ఆడడంతో, ఇప్పటి పరిస్థితులకు తగ్గట్లు కొద్దిగా కథలో మార్పులు, చేర్పులు చేసి మీరు నటిస్తే బాగుంటుందని ఆనంద్ ని కోరడం జరిగిందట. 

 

అయితే ఆ దర్శకుడి సూచనతో కొంత ఆలోచనలో పడ్డ ఆనంద్ దేవరకొండ, ఆ విషయాన్ని అన్నయ్య విజయ్ మరియు తండ్రి వర్ధన్ లతో పంచుకుని వారి సలహా కూడా కోరాడట. కెరీర్ పరంగా కొంత వైవిధ్యంగా సినిమాలు చేయాలని అని భావిస్తే మాత్రం ఆ సినిమా చేయవచ్చని, ఇప్పటి హీరోల్లాగా కమర్షియల్ పంథాలో సినిమాలు చేస్తూ వెళ్లేకంటే ఆ విధంగా కొంత డిఫరెంట్ గా ట్రై చేసి సినిమాలు చేస్తే బెటర్ అని ఆనంద్ కు సలహా ఇచ్చారట వారిద్దరూ. దానితో తాళి సినిమా రీమేక్ చేయడానికి ఆనంద్ సిద్ధం అయినట్లు టాలీవుడ్ వర్గాల టాక్. కాగా రెండు రోజలుగా పలు టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా హల్ చల్ చేస్తున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం రావలసి ఉంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: