ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో తెలుగు ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో అందరికీ తెలిసిన విషయమే. జబర్దస్త్ వస్తుందంటే టీవీలకు అతుక్కుపోతారు ప్రేక్షకులు. జబర్దస్త్ కమెడియన్ చేసే కామెడీతో కడుపుబ్బా నవ్వుతారు. ఇక స్పాంటినియస్ గా  రెస్పాండ్ అయ్యే జడ్జ్  మెగా బ్రదర్ నాగబాబు నవ్వులతో కూడా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వుకుంటారు . అయితే గత కొన్ని రోజులుగా జబర్దస్త్ మూసివేస్తారు జబర్దస్త్ నుంచి ఫేమస్ అయిన టీం లీడర్ లు అందరూ వెళ్లిపోతారు అన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇది దాదాపు ఖాయమైనట్లేనా అని ఇప్పటికే కొంత మంది కమెడియన్స్ కూడా ఇండైరెక్ట్ గా చెప్పారు. తాము జబర్దస్త్ నుంచి తాత్కాలికంగా తప్పుకుంటానని కానీ ఎప్పటికి మాత్రం జబర్దస్త్ రామని  కాదు అంటూ చమ్మక్ చంద్ర లాంటి కమెడియన్స్ ఇప్పటికే క్లారిటీ  ఇచ్చారు. అంతేకాకుండా జబర్దస్త్ జడ్జ్  నాగబాబు గారు కూడా తప్పుకుంటున్నట్లు తెలిపారు. జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి జబర్దస్త్ షో లో  కమెడియన్స్ మారుతున్నారు తప్ప... జబర్దస్త్ జడ్జ్ గా ఎంటరైన మెగా బ్రదర్ నాగబాబు  మాత్రం జబర్దస్త్ లో తనదైన మార్క్ ను వేశారు. జబర్దస్త్ అంటే నాగబాబు... నాగబాబు అంటే జబర్దస్త్  అనేంతలా  జబర్దస్త్ ను  ప్రభావితం చేశారు నాగబాబు.

 


 ఇక జబర్దస్త్ యాంకర్  అనసూయ భరద్వాజ్ కూడా జబర్దస్త్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఇప్పటికే అనసూయ ప్లేస్ లో శ్రీముఖి ని మల్లెమాల యాజమాన్యం సంప్రదించినట్లు సమాచారం. అనసూయ ప్లేస్ ని శ్రీముఖి యాంకర్ గా భర్తీ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా ప్రస్తుతం జబర్దస్త్ లో ఎక్కువగా ఫేమస్ అయిన టీమ్ లు  చమ్మక్ చంద్ర,  సుడిగాలి సుదీర్,  హైపర్ ఆది ఈ మూడు టీంలు  జబర్దస్త్ వదిలి వెళ్ళి పోతూ ఉండడంతో ఈ మూడు టీమ్ లా   ప్లేస్ లో ఈ రేంజ్ లో  కామెడీ చేసే వేరే వాళ్ళను  భర్తీ చేసే పనిలో పడిందట మల్లెమాల యాజమాన్యం. ఈ క్రమంలోనే జబర్దస్త్ షో ద్వారా బాగా పాపులర్ సినిమాల్లోకి వెళ్లి పోయినా వేణు వండర్స్, ధనాధన్ ధనరాజ్,  శకలక శంకర్ లాంటి టీం లీడర్ లను మళ్ళీ జబర్దస్త్ లోకి తీసుకోనున్నారు అని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ముగ్గురు టీం లీడర్స్ వెళ్ళిపోతే ఆ స్థానాల్లో కామెడీని ఈ ముగ్గురు మాత్రమే భర్తీ చేయగలరని మల్లెమాల యాజమాన్య భావిస్తోందట.

 


 ప్రస్తుతం ఉన్న సుడిగాలి సుదీర్,  హైపర్ ఆది,  చమ్మక్ చంద్ర టీమ్ లతో సమానంగా ఈ ముగ్గురు కామెడీ పంచి వారి స్థానాన్ని భర్తీ చేయగలరు అని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లిపోయిన వాళ్ళు మళ్ళీ రి ఏంట్రీ ఇవ్వటం  జబర్దస్త్లో కొత్తేమి కాదు. ఇప్పుడు వరకు చలాకి చంటి జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లి పోయినప్పటికీ మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కూడా వాళ్లు వెళ్లిపోయిన పడితే విలువేంటో ఇస్తుండడంతో కామెడీకి డోకా ఉండదని పలువురు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న కమెడియన్స్ కంటే సీనియర్ కమెడియన్స్ కామెడీని పంచడంలో ఆరితేరారు కాబట్టి అంతకుమించి కామెడీ అందించబోతున్నారు అని జబర్దస్త్ ప్రేక్షకులకు కూడా భావిస్తున్నారు. జబర్దస్త్ నుంచి హైపర్ ఆది,  సుడిగాలి సుదీర్,  చమ్మక్ చంద్ర టీమ్ తో సహా జబర్దస్త్ జడ్జ్ నాగబాబు,  జబర్దస్త్ యాంకర్ అనసూయ   కూడా తప్పుకోవడం  సంచలనం రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: