మెగాస్టార్ చిరంజీవి మొదటి సినిమా 'పునాది రాళ్లు'. ఆయనకి ఈ రోజు ఇలా మెగాస్టార్ అని పిలుచుకుంటున్నామంటే అందుకు కారణం చిరుకి మొదటి సినిమా ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు. ఆయనే గూడపాటి రాజ్ కుమార్. దర్శకుడు గూడపాటి రాజ్ కుమార్ ఎన్నో విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించాడు. కానీ ఆ టైం లో సంపాదించుకోక పోవడంతో ఆర్ధికంగా చాలా తక్కువ స్థాయిలోనే ఉండిపోయారు. ఇక గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని.. పట్టించుకునే కుటుంబ సభ్యులు ఎవరు లేకపోవడంతో ఆయన తీవ్ర అవస్థలు పడుతున్నట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. మొదటి సినిమాకే అయిదు నంది అవార్డులు అందుకున్న దర్శకుడు గూడపాటి రాజ్ కుమార్ ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లుగా మీడియాలో వచ్చిన వార్తలకు సినీ ప్రముఖులు స్పందించారు.

తమకు తోచిన విధంగా సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఇక రాజ్ కుమార్ గారి పరిస్థితి తెలిసిన దర్శకుడు పూరి జగన్నాధ్ వెంటనే 50 వేల రూపాయలను పంపించినట్లుగా తెలుస్తోంది. దర్శకుడు పూరి సాయంకు రాజ్ కుమార్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు. పూరి మాత్రమే కాకుండా ఇలా ఇంకా పలువురు సినీ ప్రముఖులు కూడా రాజ్ కుమార్ కు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఎవరికి తోచిన సాయం వారు చేస్తున్నారు.

పూరి రూ. 50 వేల సాయంతో పాటు మరో దర్శకుడు మెహర్ రమేష్ రూ. 10 వేలు.. నటుడు కాశీ విశ్వనాథ్ రూ.5 వేలు అందించారు. అంతకు ముందే ప్రసాద్ క్రియేటివ్ మెంటర్స్ ఫిలిం మీడియా స్కూల్ మేనేజింగ్ పార్టనర్ సురేష్ రెడ్డి రూ.41 వేల సాయంను రాజ్ కుమార్ కు అందించారు. ఇంకా పలువురు సినీ ప్రముఖులు కూడా రాజ్ కుమార్ గారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఆయనకు మంచి వైద్యం అందించడంతో పాటు ఒక స్పెషల్ సిస్టర్ ను ఏర్పాటు చేసే విషయమై ఆయన సన్నిహితులు ఆలోచిస్తున్నారట. అయితే మెగాస్టార్ ఎంత మేరకు తన మొదటి దర్శకుడికి సాయం అందించారన్నది ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు. ఇక పూరి లో గొప్ప దర్శకుడే కాక గొప్ప దాణగుణం, మానవత్వం మెండుగా ఉన్నవారని తెలిసిందే. అలనాటి సీనియర్ నటి రమాప్రభ గారికి కూడా పూరి ప్రతి నెల డబ్బు పంపిస్తు తన మంచి మనసును చాటుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: