బాహుబలి సినిమా తో ప్రపంచవ్యాప్తంగా భారతీయ చలన చిత్ర రంగానికి అదిరిపోయే గుర్తింపు తీసుకువచ్చిన ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం 'RRR' సినిమా షూటింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు ఇప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందో అన్న తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. బాహుబలి లాంటి భారీ విజయం తర్వాత చాలామంది దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు రాజమౌళి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలతో సినిమా చేస్తారని భావించారు. కానీ అందరి ఆలోచనలకు భిన్నంగా ఎప్పటి మాదిరిగానే తనకి లైఫ్ ఇచ్చిన లైఫ్ స్టార్ట్ చేసిన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఇద్దరు టాప్ మోస్ట్ హీరోలు అయినా నందమూరి మెగా కుటుంబాలకు చెందిన జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లతో కలిసి భారీ మల్టీస్టారర్ 'RRR' సినిమా ప్రాజెక్టు మొదలు పెట్టడంతో అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు.

 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. సినిమా మొదలు పెట్టిన సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ కి మరియు రామ్ చరణ్ కి గాయాలు కావడంతో సినిమా షూటింగ్ ఆగిపోవటంతో...తాజాగా మొదలుపెట్టిన షూటింగ్ చాలా శరవేగంగా జరుపుకుంటోంది. ఇదే క్రమంలో మొన్నటి వరకు ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ ఎవరు అన్న దాని విషయంలో క్లారిటీ లేదు.

 

తాజాగా ఇటీవల ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ ని కూడా రాజమౌళి సెలెక్ట్ చేయటంతో..అందరికీ క్లారిటీ వచ్చేసింది. సినిమా మొదలు పెట్టిన సందర్భంలో రాజమౌళి ఈ సినిమాను మొదట ఐదు భాషల్లో విడుదల చేయాలి అని భావించటం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా రాజమౌళి మరో ఐదు భాషలు అనగా మొత్తం పది భాషల్లో సినిమా విడుదల చేయాలనే ఆలోచనలో కొత్త టార్గెట్  ఫిక్స్ చేసుకున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: