తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఆంధ్రుల చేత అన్నా అని అనిపించుకున్న నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ను ఎన్టీఆర్ బయోపిక్ రూపంలో రెండు భాగాలుగా చిత్రీకరించి విడుదల చేశారు నందమూరి బాలయ్య బాబు. ఎన్టీఆర్ రాజకీయ మరియు సినిమా జీవితానికి సంబంధించి తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాల మధ్య విడుదల అయ్యి...దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. అంతేకాకుండా నందమూరి బాలకృష్ణ చేసిన పాత్రలపై అనేక విమర్శలు కూడా సోషల్ మీడియాలో వచ్చాయి. అయితే సినిమాకి నందమూరి బాలకృష్ణ నటించిన నటనకు అద్భుతమైన రెస్పాన్స్ రావడం జరిగింది. ఏది ఏమైనా నందమూరి తారక రామారావు జీవిత చరిత్రకు సంబంధించి బాలయ్య బాబు తీసిన సినిమా దారుణంగా ఫ్లాప్ కావడంతో మళ్లీ ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి బాలకృష్ణ చేసే అవకాశాలు లేవు అన్నట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి.

 

ఇదిలా ఉండగా తాజాగా తమిళ ప్రజల చేత అమ్మ అని అనిపించుకున్న జయలలిత జీవితానికి సంబంధించి తెరకెక్కుతున్న “తలైవి” బయోపిక్ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఇలాంటి నేపథ్యంలో జయలలిత రాజకీయ జీవితంలో రెండు పెద్ద తలకాయలు అయినా ఎన్టీయార్, ఎంజీయార్ క్యారెక్టర్ల విషయంలో ఎవరిని తీసుకోవాలనే ఆలోచనలో “తలైవి” సినిమా యూనిట్ తర్జన భర్జన పడుతున్నారు.

 

ఈ నేపథ్యంలో సీనియర్ ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ని సెలక్ట్ చేసుకున్నట్లు వార్తలు వచ్చిన క్రమంలో తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తాత పాత్రలో నటించడానికి సాహసం చేయటం లేనట్టు ఉండటంతో..ఎన్టీయార్ పాత్రకు బాలకృష్ణే బెస్ట్ ఛాయిస్ గా భావిస్తూ అతన్ని సంప్రదిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎన్టీయార్ ను మళ్లీ వెండితెరపై ప్రెసెంట్ చేయడానికి బాలకృష్ణ అంగీకరిస్తారో లేదో ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ నెలకొనివుంది. ఇదిలా ఉండగా మళ్లీ ఎన్టీఆర్ పాత్రలో...బాలకృష్ణ నటిస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో రాగా నందమూరి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: