చిరంజీవి కొత్తగా నిర్మించుకున్న అత్యాధునిక విలాసవంతమైన మెగా ప్యాలెస్ ఇప్పుడు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి హాట్ టాపిక్ గా మారడంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ మెగా ప్యాలెస్ గురించి కబుర్లు వినిపిస్తున్నాయి. చిరంజీవి గతంలో చెన్నై నుండి హైదరాబాద్ తిరిగి వచ్చిన తరువాత జూబ్లీహిల్స్ లో ఒక భారీ భవంతి కట్టుకున్నాడు. 

అయితే ఆ భవంతి చిరంజీవికి వాస్తు రీత్యా సరిగ్గా కలిసిరాలేదు అన్ననమ్మకం అతడికి ఉంది అని అంటారు. దీనికి కారణం ఈ ఇంటిలోకి వచ్చిన తరువాత చిరంజీవి పెట్టిన ‘ప్రజారాజ్యం’ ఫెయిల్ అవ్వడంతో తిరిగి అతడు కోలుకుని మళ్ళీ టాప్ హీరోగా మారడానికి 9 సంవత్సరాలకు పైగా కాలం పట్టింది. 

ఈసెంటిమెంట్ రీత్యా అన్నివిధాల వాస్తు తనకు తన కుటుంబ సభ్యులకు సరిపోయే విధంగా జూబ్లీహిల్స్ లో ఉన్న MCHRD ఇన్స్టిట్యూట్ దగ్గర చిరంజీవి నిర్మించిన అత్యంత విలాసవంతమైన భవంతి విషయాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. 25,000 చదరపు గజాల విస్తీరణంలో నిర్మింపబడ్డ ఈభవంతిని ముంబాయికి చెందిన ప్రముఖ ఆర్కెటిక్ తైలని హోమ్స్ సంస్థ డిజైన్ చేసింది. ఈసంస్థ ఇంటికి సంబంధించి డిజైన్ చేసి ఇవ్వడానికి కోటి రూపాయల ఫీజు తీసుకుంటుంది అంటే ఈసంస్థ డిజైన్ చేసే భవంతులు ఏ రేంజ్ లో ఉంటాయో అర్ధం అవుతుంది. 

తెలుస్తున్న సమాచారం మేరకు చిరంజీవి తన కొత్త ఇంటిని అడుగడుగునా భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా అత్యంత అధునాతన వసతులతో నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంటిలోని ఒక రూమ్ ఫ్లోరింగ్ చెస్ బోర్డ్ గడులు రూపంగా చెక్కితే మరొక హాలులో జేడ్ డెకరేటెడ్ వాల్స్ సీలింగ్స్ తో ప్రతి గదిలోనూ అత్యంత ఖరీదైన ఇటాలియన్ మార్బుల్ తో ఈఇంటి ఫ్లోరింగ్ కనిపిస్తుందని సమాచారం. అంతేకాదు ఈఇంటి పూజా గది నిర్మాణం రెండవ శతాబ్దపు కాలంనాటి ఆలయాల రూపంలో కనిపిస్తూ చూసేవారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని అంటున్నారు. రేపు సాయంత్రం తన కొత్త ఇంటిలోకి గృహ ప్రవేశం అయిన తరువాత ఈఇంటిలోకి చిరంజీవి మారిపోతాడని తెలుస్తోంది..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: