1970 ప్రాంతంలో వామపక్ష భావజాలంతో ఉద్యమాలు చేసి ప్రాణాలు పోగొట్టుకున్న విద్యార్థినాయకుడు జార్జి రెడ్డి జీవితం ఆధారంగా నిర్మించబడ్డ మూవీ ప్రీమియర్ షోలు నిన్న రాత్రి హైదరాబాద్ లో కొన్నిచోట్ల జరిగాయి. ఈమూవీని చూసిన ప్రేక్షకులు అదేవిధంగా ఈమూవీని చూసిన ఓవర్సీస్ ప్రేక్షకులు ఈమూవీ పై వ్యక్త పరుస్తున్న అభిప్రాయాలు బట్టి ఈమూవీ హిట్ టాక్ వైపు అడుగులు వేస్తోంది. 

ఈమూవీని ప్రశంసిస్తూ అనేకమంది కామెంట్స్ చేస్తూ ఇలాంటి మూవీని పవన్ కళ్యాణ్ చేసి ఉంటే అతడి రీ ఎంట్రీ అదిరిపోయి ఉండేదని కామెంట్స్ చేస్తూ పవన్ ఒకఅద్భుతమైన అవకాశం జారవిడుచుకున్నాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈమూవీ కథలో జార్జి రెడ్డి ఆరెస్సెస్ మధ్య గొడవలు ప్రధానమైనవే అయినా ఆవిషయాలను చూపించకుండా వేరే విషయాలను చూపించడంతో ఈమూవీ కథలో వాస్తవికత లోపించింది అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి. 

 

అయితే ఈమూవీ దర్శకుడు జీవన్ రెడ్డి ఈ మూవీని నడిపించిన తీరు సాధారణ ప్రేక్షకులకు కూడ కనెక్ట్ అయ్యే విధంగా ఉండటంతో ఈమూవీ ఖచ్చితమైన విజయం సాధిస్తుంది అని అంటున్నారు. ముఖ్యంగా ఈమూవీలోని యూనివర్సిటీ సీన్స్ డైలాగ్స్ మూవీకి ప్రాణం పొసాయి అని ఈమూవీని చూసిన సగటు ప్రేక్షకుడు అభిప్రాయ పడుతున్నాడు. 

ప్రస్తుత పరిస్థితులలో జార్జి రెడ్డి లాంటి నిజాయితీతో కూడిన వ్యక్తి ఉండి ఉంటే ఎంత బాగుంటుంది అన్న భావన రావడమే కాకుండా మూవీని చూసిన తరువాత భారమైన మనసుతో ప్రేక్షకులు బయటకు వస్తారు అన్నఅభిప్రాయం వ్యక్తం అవుతోంది. మూవీ కథనం విషయంలో దర్శకుడు పొరపాట్లు చేసాడనీ ఒక రియల్ హీరోకి నివాళి అర్పించే రేంజ్ లో ఈసినిమా లేదనీ ఈసినిమాకు ఎవరైనా ఒక టాప్ డైరెక్టర్ దర్శకత్వం వహించి ఉంటే మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా మారి ఉండేదనీ అభిప్రాయ పడుతున్నారు. ఈమూవీ కథనంలో లోపాలు కనిపించడంతో జార్జి రెడ్డి ఐడియాలజీ ఎలివేట్ కాలేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే మూవీలోని ఫైర్ బాల్ బ్లేడ్ ఫైట్ సీన్లు యూత్ కు బాగా కనెక్ట్ అవుతాయి. ఈమూవీకి ఇలా హిట్ టాక్ రావడంతో ఈమూవీలో పవన్ కళ్యాణ్ నటించి ఉంటే ఎంత బాగుండేది అంటూ పవన్ అభిమానులు నిరాశ పడుతున్నారు..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: