`మజిలీ`తో విజయం అందుకున్న అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌తో కలిసి `వెంకీ మామ` సినిమా చేస్తున్న నాగచైతన్య ఇటీవలె డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాను ప్రారంభించాడు.

 

ప్ర‌స్తుతం ఆయ‌న అభిమానులకు ఒక తీపి క‌బురు చెప్పారు. అంతేకాదు ముందస్తుగా ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇది నాగచైతన్యకు 19వ సినిమా. ఈ సినిమాలో నాగచైతన్య లుక్‌ను చిత్ర యూనిట్ గురువారం విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో సూపర్ కూల్ లుక్‌లో నాగ చైతన్య ఉల్లాసంగా కనిపిస్తున్నారు.

 

ఇదిలా ఉంటే, నాగచైతన్య  నవంబర్ 23న  ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఉదయం 10.30 నిమిషాలకు ఈ సినిమాలోని హీరో క్యారెక్టర్‌ని పరిచయం చేసే ఓ వీడియోను విడుద‌ల‌ చేయడానికి స‌న్నాహాలు చేస్తున్నారు ద‌ర్శ‌కులు.  ఈ మేరకు నాగచైతన్య ట్విట్టర్ ద్వారా ఈ విష‌యాన్ని అభిమానుల‌తో పంచుకున్నారు. తన బర్త్ డే సందర్భంగా ఆయన ప్రపంచంలోకి మనల్ని అహ్వానిస్తున్నారు నాగచైతన్య. అక్కినేని అభిమానులకు, సినిమా ప్రేమికులకు కొత్త ఎక్స్‌పీరియన్స్‌గా ఈ వీడియో ఉండబోతోందని చిత్ర యూనిట్ వెల్లడించింది.

 

మరోవైపు `ఆర్ఎక్స్100` దర్శకుడు అజయ్ భూపతి చెప్పిన కథకు కూడా నాగచైతన్య పచ్చజెండా ఊపినట్టు సమాచారం. తాజాగా మరో సినిమాకు నాగచైతన్య ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మాణంలో నూతన దర్శకుడు శశి రూపొందించబోయే సినిమాకు కూడా నాగచైతన్య గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట. రష్మికా మందన్నా ఈ సినిమాలో హీరోయిన్ అని తెలుస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ భాగస్వామిగా ఉన్న యూవీ క్రియేషన్స్ సంస్థ నాగచైతన్యతో సినిమా చేస్తుందట.‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాల దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. శేఖర్ కమ్ములతో సినిమా అనంతరం గాంధీ దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తారని ఫిల్మ్ నగర్ టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: