అల్లు అర్జున్ ఇపుడు ఎక్కడ ఉన్నారు అంటే అల వైకుంఠపురంలో అని చెప్పాలి. ఆయన ఈ సినిమా వేగంగా ఫినిష్ చేసే ఆలోచనలో ఉన్నారు. వచ్చే  సంక్రాంతి కి కోడి పుంజుగా ఈ మూవీని రెడీ చేసి వదులుతున్నాడు బన్నీ. ఈ మూవీ తరువాత మూవీని కూడా బన్నీ సెట్ చేసేస్తున్నారు. బన్నీ ఏడాది పాటు ఏ సినిమా చేయకుండా గ్యాప్ తీసుకున్నారు. ఇపుడు ఆ గ్యాప్ ని సర్దుకుంటూనే మంచి కధలతో దూసుకుపోవాలనుకుంటున్నారు. బన్నీకి వరసగా హిట్లు ఇచ్చిన  టాలెంటెడ్ డైరెక్టర్, బ్లాక్ బస్టర్ హిట్ ని రీసెంట్ గా ఇచ్చిన సుక్కూతో కొత్త మూవీ చేస్తున్నాడు. 

 

ఈ మూవీలో బన్నీ ఎర్ర చందనం దుంగలను దొంగిలించే పాత్రలో కనిపిస్తారట. ఇది పూర్తిగా డీ గ్లామర్ రోల్. ఇందులో బన్నీని వూహించుకుంటేనే కొత్త ఆలోచనలు, ఆసక్తి కలుగుతున్నాయి. అసలే అక్కడ ఉన్నది సుకుమార్, రంగస్థలం మూవీ మొత్తం మీద లుంగీతో రామ్ చరణ్ ని నడిపించి హిట్ కొట్టిన గ్రేట్ డైరెక్టర్ సుక్కూ.

 


ఆయన ఇపుడు బన్నీని పూర్తిగా మాస్ గా మార్చేస్తున్నారు. పైగా తమిళనాడు బోర్డర్లలో జరిగే కధగా దీన్ని డిజైన్ చేస్తున్నాడు. ఈ మూవీలో అక్రమంగా కలపను దొంగిలించే లారీ డ్రైవర్ పాత్రలో బన్నీ కనిపించి  కనువిందు చేస్తాడట. ఈ మూవీ కోసం బన్నీ కూడా పాత్రకు  తగిన విధంగా మారడానికి అపుడే  రెడీ అవుతున్నాడని టాక్.

 

ఇక ఈ మూవీలో బన్నీకి జంటగా రష్మిక మందన నటిస్తోందిట. ఈ అమ్మాయి రోల్ కూడా  సినిమాలో అక్రమ కలప కూలీగా కనిపిస్తుందిట. అంటే రంగస్థలంలో సమంత, రామ్ చరణ్ పల్లెటూరు, మాస్ వేషాలు రొమాన్స్ అలా ఈ సినిమాలో కూడా సుక్కూ తనదైన మార్క్ తో డిజైన్ చేశాడుట. కొత్త ఏడాది ఈ మూవీ సెట్స్ మీదకు వస్తుంది. మరి సుక్కూ, బన్నీ హిట్ కాంబో, ఇపుడు ఈ మూవీ స్టోరీ లైన్ చూస్తూంటే మరో  రంగస్థలం మాదిరిగా బ్లాక్  బస్టర్ హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: