అక్కినేని ఫ్యామిలీలో కొత్త వ్యక్తి రాబోతున్నాడా.. నాగార్జున ఫ్యామిలీ మరింత విస్తరించబోతుందా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అక్కినేని నాగ చైతన్య, సమంతలు ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. పెళ్లైనా సరే వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమంత పిల్లల విషయంలో ఎక్సైటింగ్ గా ఉందని కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పింది.

 

అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం సమంత తల్లి కాబోతుందన్న వార్త బలంగా వినిపిస్తుంది. ప్రస్తుతం సమంత గర్భవతి అని ప్రెజెంట్ సెకండ్ మంత్ నడుస్తుందని అంటున్నారు. అయితే ఇది కేవలం గాసిప్పా లేక నిజమా అన్నది కొద్దిరోజుల్లో తెలుస్తుంది. రీసెంట్ గా సమంత సినిమాలను కూడా తగ్గించేసింది.

 

ప్రస్తుతం 96 రీమేక్ లో నటిస్తున్న సమంతసినిమా పూర్తి చేశాక కొద్దిపాటి గ్యాప్ తీసుకునే ఆలోచనలో ఉందట. నాగ చైతన్య మజిలీ సినిమాతో ఫాంలో వచ్చాడు. అందుకే ఇక సమంత తన కెరియర్ కు లాంగ్ బ్రేక్ ఇవ్వాలని అనుకుంటుంది. సౌత్ స్టార్ హీరోయిన్ గా సమంత ఎన్నో సూపర్ హిట్లు అందుకుంది. పెళ్లి తర్వాత కూడా ఏ హీరోయిన్ దక్కించుకోలేని క్రేజ్ తనకు వచ్చింది.   

 

ఈ ఇయర్ మజిలీ, ఓ బేబీ సినిమాలతో అలరించిన సమంత నెక్స్ట్ ఇయర్ 96 రీమేక్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సమంత ప్రెగ్నెన్సీ న్యూస్ కన్ ఫాం అయితే ఇక ఆమె మరో రెండేళ్ల వరకు సినిమాలకు దూరంగా ఉంటుందని తెలుస్తుంది. ఇక దాదాపు ఆమెను అదపాదడపా చిన్న చిన్న పాత్రల్లో చూడటమే తప్ప హీరోయిన్ గా నటించడం కూడా కష్టమే అంటున్నారు. అయితే ఈమధ్య ఓ చిట్ చాట్ లో తన బేబీ గురించి అడిగిన ఫ్యాన్ ను 2022 ఆగష్టు 7 ఉదయం 7 గంటలకు అని సీరియస్ అయిన సమంత మరోసారి ఆమె ప్రెగ్నెన్సీ న్యూస్ లపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: