మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఆలోచనలు లేవని ఓపెన్ గానే చెపుతున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో తేజ్ ను పెళ్ళికి రమ్మని ఆహ్వానిస్తూ వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వడానికి కూడ భయపడిపోతున్న ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. 

ఈమధ్య కాలంలో యంగ్ హీరోలు తాము నటించే సినిమాల కథల ఎంపికలో చాల వెరైటీ చూపించడానికి చాల తాపత్రయ పడుతున్నారు. ముఖ్యంగా వరస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న తేజ్ తన మూవీ కథల ఎంపికలో మరింత జాగ్రత్తలు తీసుకుంటూ గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా వ్యూహాలు రచిస్తున్నారు. 

ప్రస్తుతం ఈ యంగ్ హీరో లేటెస్ట్ గా నటిస్తున్న ‘సోలో బతుకే సో బెట‌రూ’ క‌థ చాల వెరైటీగా ఉంటుంది అని అంటున్నారు. గతంలో నాగార్జున నటించిన ‘మన్మధుడు’ మూవీ పోలికలో పెళ్లంటే ప‌డ‌ని ఒక యువ‌కుడి క‌థ‌ ఇది అని అంటున్నారు. అయితే ఈ మూవీ కథనంలో మార్పులు చేసి ఈ మూవీలో తేజ్  బ‌ల‌వంతంగా పెళ్లిళ్లు ఆపేస్తుంటాడు. ఎవ‌రైనా తేజ్ ని పెళ్లికి పిలిస్తే చాలు ఆ పెళ్ళిని ఆపడమే ధ్యేయంగా తిరుగుతూ అనేక ప్రయత్నాలు చేస్తాడు. 

దీనితో తేజ్ ను పెళ్ళికి పిలవడానికి కూడ భయపడే పరిస్థితులు ఏర్పడతాయి. అంతేకాదు ఈ మూవీలో తేజ్ సోలో బ‌తుకే సో బెట‌రు’ అనే పుస్తకం కూడ రాస్తాడు. ఈ పుస్తకాన్ని చదివిన ఈ మూవీ హీరోయిన్ తేజ్ ను గురువుగా ఎంచుకుని అతడి అడుగుజాడలలో నడవడానికి ప్రయత్నిస్తూ తనకు తెలియకుండానే తేజ్ ను ప్రేమిస్తుంది. ఈ సన్నివేశాలు అన్నీ చాల నవ్వు తెప్పించే విధంగా  యంగ్ డైరెక్టర్ సుబ్బు తీస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీతో సాయి ధరమ్ తేజ్ కెరియర్ మళ్ళీ ట్రాక్ లో పడుతుంది అన్న మాటలు వినిపిస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: