బాలీవుడ్ నటీనటులకు ఫిలిం కంపానియన్ అనే సంస్థ టాప్ 100 బెస్ట్ యాక్టర్స్ లిస్ట్‌ తీసి మెడల్స్ ఇవ్వాలనుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ లిస్ట్‌లో బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్, విజయ్ దేవరకొండ, తమిళ నటుడు ఫాహద్ ఫాసిల్ ఉన్నారు. ఈ విషయాన్ని తమ ట్విటర్ ఖాతాలో ప్రకటించారు. ఈ విషయం రంగోలీ దృష్టికి వచ్చింది. ఇక ఆమె ఆగుతారా? వరుస ట్వీట్లతో ఏకిపారేశారు. అసలే కంగనా రనౌత్ సోదరి రంగోలీ చందేల్‌ ఎంత బోల్డ్‌గా మాట్లాడతారో అందరికి తెలిసిన విషయమే.

 

 

ఇలాంటి ఈవిడ చెల్లెలి జోలికి ఎవరైనా వచ్చినా, తను నటించిన సినిమాల గురించి తప్పుగా మాట్లాడినా ఆమె చేతిలో వారు చచ్చినట్లే. అలాంటిది తాజాగా మూవీ మాఫియా అంటూ రంగోలీ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే మూవీ మాఫియా అంటే  రంగోలీ అభిప్రాయంలో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ అన్నమాట. కాని ఈ సారి విజయ్ దేవరకొండ కూడా టాపిక్‌లోకి వచ్చారు.

 

 

ఇక యాక్టర్స్ లిస్ట్‌ తయారు చేసిన వారిని ఘాటుగా విమర్శిస్తూ మూవీ మాఫియాకు చెందిన చెంచాగాళ్లు గొప్ప నటీనటులకు మెడల్స్ ఇవ్వడానికి సిద్ధమైనారు. ఇలాంటి అడుక్కుతినే వెధవలకు ఎప్పుడూ ఓ గొప్ప పని చేయడం చేతకాదు. అలాంటిది ఇర్ఫాన్ ఖాన్, విజయ్ దేవరకొండలాంటి గొప్ప నటులు చేసే పనిని వాడుకునే హక్కు వారికి ఎవరు ఇచ్చారు? ముందు మీరున్న స్థానాలేంటో తెలుసుకోండి అంటూ వాఖ్యానించారు..

 

 

ఇక ఇక్కడ కొందరయితే భర్త మాఫియాను నమ్ముకుని బతికేస్తుంటారు. ఫేమస్ భర్తల పేర్లు వాడుకుని ఇతరుల నటన గురించి తప్పుగా మాట్లాడుతుంటారు? అనుపమ చోప్రాలాంటి గొప్ప జర్నలిస్ట్.. కరణ్ జోహార్ తీసిన ఫ్లాప్ సినిమా ‘కళంక్’ గురించి తెగ పొగిడేసింది. ఆమెకు ఇతర నటుల పనిని జడ్జ్ చేసే హక్కు ఉందా? వెళ్లు..వెళ్లి కిట్టీ పార్టీలు చేసుకోపో. ఇంకోసారి ఇలాంటి పనికిమాలిన సర్వేల్లో నా చెల్లి కంగనా రనౌత్ పేరు వాడితే కంగన మీ బండారం బయటపెడుతుంది’ అని ఘాటైన పదాలతో కడిగిపడేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: