అక్కినేని నాగ చైతన్య భార్య, నాగార్జున కోడలు సమంతా అక్కినేని తన మొదటి బిడ్డకు జన్మని ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 96 రీమేక్ తరువాత సినిమాల నుంచి విరామం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కొన్ని సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం సమంతా రెండు నెలల గర్భవతి అని తెలుస్తోంది.

సమంతా అక్కినేని తన ప్రొఫెషన్ లైఫ్ కు కొంత విరామం ఇస్తున్నారని తెలుస్తోంది ఈ క్రమంలో ఆమె తన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 యొక్క షూటింగ్ ను త్వరగా పూర్తి చెయ్యడానికి చాలా కష్టపడుతున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. రంగస్థలం నటి సమంత తను గర్భవతినని ఇప్పటికే నిర్మాతలకు తెలియజేసినట్లు సమాచారం. సినిమా ఆఫర్లతో ఆమెను సంప్రదిస్తున్న నిర్మాతలకు సమంత ఈ విషయాన్ని చెప్పేస్తున్నారంట.

సమంతా అక్కినేని రెండు నెలల గర్భవతి అని మీడియా సర్కిల్ మరియు ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది, అందువల్ల ఆమె తన వెబ్ సిరీస్ షూట్ ను జెట్ వేగంతో పూర్తి చేస్తోంది. జనవరి 2020 నుండి ఆమె నటన నుంచి విరామం తీసుకుంటుందని కూడా వినబడుతోంది. ఇటీవల జరిగిన ఏఎన్నార్ అవార్డుల కార్యక్రమం కి  ఆమె హాజరు కాకపోవడం తో సమంత గర్భవతి అనే వార్త కు బలాన్నిస్తోంది.

సమంతా అక్కినేని మరియు నాగ చైతన్య 2017 అక్టోబర్ నెలలో వివాహం చేసుకున్నారు. ఏప్రిల్ 2018 లో, సమంతా ఒక ఇంటర్వ్యూలో తమకు  బిడ్డ పుట్టడానికి ఒక టైమ్‌లైన్‌ను నిర్ణయించుకున్నట్లు తెలిపారు. సమంతా చివరిసారిగా ఓ బేబీ సినిమా లో కనిపించింది, ఇది బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆమె తన రాబోయే చిత్రం జాను విడుదల కోసం వేచి న్నారు, ఇది తమిళ చిత్రం 96 యొక్క రీమేక్, ఇందులో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: