ఒకానొక సమయంలో నాగశౌర్యకు ఏర్పడిన క్రేజ్ ను పరిశీలించిన వారికి ఈ యంగ్ హీరో చాల వేగంగా టాప్ యంగ్ హీరోల లిస్టులోకి చేరిపోతాడు అని భావించారు. అయితే ఇతడి సినిమాలు వరస పరాజయాలు చెందడంతో ఇతడి పరిస్థితి ప్రస్తుతం ఆశాజనకంగా లేదు. 

ఇలాంటి పరిస్థితులలో ఈ యంగ్ హీరో తన సొంత ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించి తీసిన సినిమాలు కూడ ఫెయిల్ కావడంతో ఆర్ధికంగా ఇతడికి నష్టాలు వచ్చాయి అన్న వార్తలు ఉన్నాయి. ‘ఓ బేబి’ సినిమాలో ఇతడి పాత్రకు మంచి పేరు వచ్చినా పెద్దగా అవకాశాలు రాలేదు. 

ప్రస్తుతం ‘అశ్వద్దామ’ అనే మూవీలో నటిస్తున్న ఈ యంగ్ హీరోమూవీ విజయం పై చాల ఆశలు పెట్టుకున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఈ యంగ్ హీరో పై ఒక షాకింగ్ రూమర్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తోంది. ఇప్పుడు నాగశౌర్య ఒక అమ్మాయితో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

అయితే ఆ అమ్మాయి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి కాదనీ ఆమె హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఒక ప్రముఖ వ్యాపార వేత్త కూతురు అన్న ప్రచారం జరుగుతోంది. గతంలో ఈ యంగ్ హీరో నిహారికతో ప్రేమలో పడి ఆ ప్రేమ పెళ్ళి వరకు వెళుతుంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ తరువాత ఆ వార్తలు చల్లారిపోవడమే కాకుండా వీరిద్దరూ ఆ వార్తలను ఖండించారు. నిహారిక వెబ్ సిరీస్ లు చేసుకుంటూ బిజీగా ఉంటే నాగశౌర్య తన సినిమాల హడావిడిలో పడిపోయి వీరిద్దరూ తమ స్నేహాన్ని మరిచిపోయారు. ఇప్పుడు ఈ హీరో ఫ్రెష్ గా మొదలు పెట్టిన ఈ డేటింగ్ వ్యవహారం పెళ్ళి పీటలు వరకు వెళ్ళుతుందా లేదంటే నాగశౌర్య పై గతంలో వచ్చిన వార్తల లాగే ఆగిపోతుందా అన్న విషయం వేచి చూడాలి..    

 

మరింత సమాచారం తెలుసుకోండి: