విశ్వంత్, హర్షిత జంటగా రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా తోలుబొమ్మలాట. విశనాథ్ మాగంటి డైరక్షన్ లో తెరకెక్కైన ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శతమానం భవతి తర్వాత అలాంటి ఫ్యామిలీ ఎమోషన్స్ తో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

 

కథ :

అచ్యుతాపురం గ్రామంలో రైస్ మిస్ ఓనర్ సోడాల రాజు అలియాస్ సోమరాజు తన మనవడు రిషి (విశ్వంత్), వర్ష (హర్షిత) ప్రేమని గెలిపించడం కోసం ఓ చిన్న నాటకం ఆడి కొడుకుని కూతుళ్లను ఇంటికి రప్పిస్తాడు. అయితే అనుకోకుండా సోమరాజు చనిపోవడంతో అతని కుటుంబంలో గొడవలవుతాయి. వాళ్లంతా కలిసి ఉంటున్నారని అనుకున్న సోమరాజు చాలా బాధపడతాడు. ఆత్మగా వచ్చి సంతోష్ (వెన్నెల కిశోర్) సహాయంతో తను చేయాలని అనుకున్నది చేస్తాడు. ఇంతకీ సోమరాజు ఎలా మరణించాడు..? మనవడి ప్రేమను గెలిపించడం కోసం సోమరాజు ఆడిన నాటకం ఏంటి..? ఇంతకీ అతని వాళ్లిద్దరి ప్రేమను గెలిపించాడా లేదా అన్నది సినిమాలో చూడాలి.

 

విశ్లేషణ : 

తొలుబొమ్మలాట టైటిల్ మాత్రమే కాదు టీజర్, ట్రైలర్ చూస్తేనే ఇదో ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అనిపిస్తుంది. దర్శకుడు విశ్వనాథ్ తను చెప్పదలచుకున్న పాయింట్ ను సినిమా స్టార్టింగ్ తోనే కొంతమంది మాట్లాడుతుండగా చెప్పించిన డైలాగ్ సినిమా అర్ధాన్ని తెలియచేస్తుంది. ఇక అనుకోకుండా మనవడు మనవరాలు ప్రేమించుకోవడం వారి ప్రేమను గెలిపిస్తానని తాతగా సోమరాజు హామి ఇవ్వడం ఇలా ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా సాగుతుంది.

 

ఇక సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీలో గొడవలు.. ఎవరికి వారు విడిపోవడం.. చివరకు ప్రేమించుకున్న వ్యక్తులు కూడా దూరమవడానికి సిద్ధపడటం లాంటివి నడుస్తాయి. సినిమా కథ బాగున్నా ఈ కథను తెరకెక్కించడంలో దర్శకుడు తడబడ్డాడని చెప్పొచ్చు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన తోలుబొమ్మలాట సినిమా ఒకానొక దశలో ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి సినిమాల్లా అనిపిస్తుంది.

 

సినిమాలో దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ బాగున్నా దాన్ని తెరకెక్కించడంలో విఫలమయ్యాడు. అయితే సినిమా ఓపెనింగ్ తో పాటుగా క్లైమాక్స్ సీన్ బాగా రాసుకున్నాడు. దర్శకుడు మొదటి సినిమానే అయినా ప్రతిభ చూపించాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నా సరే సినిమాలో ఇంకా ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఓవరాల్ గా తోలుబొమ్మలాట మెప్పించిండంలో విఫలమైందని చెప్పొచ్చు.  

 

నటీనటిల ప్రతిభ :

సినిమా మొత్తం రాజేంద్ర ప్రసాద్ పాత్ర మీద నడుస్తుంది. తన అనుభవాన్ని రంగరించి సోమరాజు అలియాస్ సోడాల రాజు పాత్రకు న్యాయం చేశాడు రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఈ సినిమాలో వెన్నెల కిశోర్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. రాజేంద్ర ప్రసాద్ తో వెన్నెల కిశోర్ కామెడీ అలరించింది. విశ్వంత్, హర్షిత జోడీ బాగుంది.. ఇద్దరు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక మిగతా వారంతా తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

 

సాంకేతికవర్గం : 

సతీష్ కెమెరా వర్క్ బాగుంది. సినిమాకు సినిమాటోగ్రఫీ ప్లస్ అని చెప్పొచ్చు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ జస్ట్ ఓకే అనేలా ఉంది. బిజిఎం కూడా పర్వాలేదు. దర్శకుడు విశ్వనాథ్ మొదటి సినిమా కథ బాగున్నా కథనంలో ఆ మ్యాజిక్ చేయలేకపోయాడు మెప్పించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

 

ప్లస్ పాయింట్స్ : 

రాజేంద్ర ప్రసాద్

స్టోరీ లైన్

వెన్నెల కిశోర్

ఎమోషనల్ సీన్స్

 

మైనస్ పాయింట్స్ :

కథనంలో పట్టులేకపోవడం

మ్యూజిక్

 

బాటం లైన్ :

తోలుబొమ్మలాట.. కథ ఓకే కాని కథనమే..!  

 

రేటింగ్ : 2/5 

మరింత సమాచారం తెలుసుకోండి: