టాలీవుడ్ సినిమాల స్థాయి సినిమా.. సినిమాకు మారిపోతోంది. ఒకప్పుడు భారతీయ నటులు హాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు సాధిస్తే అదో గొప్ప. ఇప్పుడు హాలీవుడ్ నటులే తెలుగులో నటించే స్థాయికి మన  సినిమా ఎదిగిపోయింది. బాలీవుడ్ లో వచ్చిన లగాన్, ఇటివల సైరాలో ఇంగ్లీష్ నటులు నటించారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ వంతు వచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో ఓ హీరోయిన్, కొన్ని కీలక పాత్రలకు హాలీవుడ్ నటులను తీసుకోవటం చర్చనీయాంశమైంది.

 

 

ఎన్టీఆర్ కు జోడీగా ఒలివియా మోరిస్ పేరు ప్రకటించగానే గూగుల్ సెర్చ్ లో సెకండ్ ప్లేస్ లో నిలిచింది ఆమె పేరు. మోడల్, ధియేటర్ ఆర్టిస్ట్ అయిన ఆమె పలు సీరియల్స్, షోస్ లో నటించింది. ‘సెవన్ టైల్స్’ టీవీ సిరీస్ ద్వారా ఆమెకు గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే సినిమాలో అవకాశం దక్కించుకుంది. స్కాట్ అనే విలన్ పాత్రకు ఐర్లాండ్ కు చెందిన రే స్టీవెన్సన్ ను తీసుకున్నారు. ది థియరీ ఆఫ్ ఫైట్, ఔట్ పోస్ట్, పనిషర్: వార్ జోన్, బిగ్ గేమ్, కోల్డ్ స్కిన్.. వంటి పలు హాలీవుడ్ సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం పలు సిరీస్ ల్లో నటిస్తూ ఈ సినిమాకు ఎంపికయ్యాడు. లేడీ స్కాట్ గా ఐర్లాండ్ కే చెందిన అలిసన్ డూడీ ఎంపికైంది. 1985లో ఏ వ్యూ టు ఎ కిల్ అనే హాలీవుడ్ సినిమాలో నటించింది. ఏ ప్రేయర్ ఫర్ డైయింగ్, ది సీక్రెట్ గార్డెన్, డ్యూయల్ ఆఫ్ హార్ట్స్, డివిజన్ 19.. వంటి హాలీవుడ్ సినిమాల్లో నటించి మెప్పించింది.

 

 

ఇంకా.. అనుష్క నటిస్తున్న నిశ్శబ్దం సినిమాతో హాలీవుడ్ నటుడు టాలీవుడ్ కి మైఖేల్ పరిచయమవుతున్నాడు. 1982లో అగైన్స్ట్ ఆల్ హోప్ సినిమా నుంచి థెల్మా అండ్ లూసీ.. వంటి సినిమాల్లో నటించాడు. సినిమాలతో పాటు టెలివిజన్ సిరీస్, మ్యూజిక్ ఆల్బమ్స్, వీడియో గేమ్స్ కు వాయిస్ ఇచ్చాడు. గతంలో కూడా పలువురు హీలీవుడ్ నటులు ఇండియన్ సినిమాల్లో నటించారు. సిల్వస్టర్ స్టాలోన్, బ్రాండన్ రౌత్, డెనిస్ రిచర్డ్స్, హోలీ వ్యాలెన్స్, బెన్ కింగ్ స్లే, బార్బరా మోరీ, డాంగ్ లీ.. ఇలా పలు సినిమాల్లో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: