స్టార్ల పారితోషికాలు ఎప్పటికి హాట్ టాపిక్. అయితే ఇటీవలి కాలంలో పారితోషికాల్లో లెక్కలు మారాయి. రిస్క్ నిర్మాతల నుంచి తేసేస్తున్నాం అంటూ లాభాల్లో వాటాలు, ఏరియాల హక్కులు అడగడం అలవాటు అయిపోయింది హీరోలకి. అయితే ఇందులోనూ కండిషన్స్ అప్లయ్ అంటూ హీరోలు వేస్తున్న స్కెచ్ మామూలుగా లేదుగా. అసలు థియేట్రికల్ కలెక్షన్స్ కంటే ఇప్పుడు నాన్ థియేట్రికల్ ద్వారా వచ్చే ప్యాకేజ్ మొత్తం ఆశావహంగా ఉండడంతో ఆ మొత్తాన్ని నిర్మాతకు దక్కకుండా  హీరోలు జాగ్రత్త పడుతున్నారని ప్రచారం గట్టిగా వినిపిస్తుంది . ``నాన్ థియేట్రికల్ రైట్స్`` మాకు ఇచ్చేయండి. అదే మా పారితోషికం అంటూ హీరోలు మెలిక వేస్తుండడంతో నిర్మాతలకు అది గిట్టుబాటు కాదని తెలిసినా ఒప్పుకోక తప్పడం లేదు.

 

అయితే నాన్ థియేట్రికల్ రైట్స్ అనేవి హీరో రేంజును బట్టి ఎప్పటికప్పుడు మారుతుంటుంది. స్టార్ డమ్ కి తగ్గట్టు ఒక్కోసారి వర్కవుటైనా ఒక్కోసారి ఊహించని రీతిలో ఎదురు దెబ్బ తగులుతుయింది. అలా ఈసారి సూపర్ స్టార్ మహేష్ విసిరిన పాచిక పారలేదని గుసగుసలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రానికి నాన్ థియేట్రికల్ రైట్స్ తన కే చెందుతాయి అని మహేష్ పారితోషికం లేకుండా ఒప్పందం చేసుకున్నారట. జీఎంబీ బ్యానర్ లోగోని పోస్టర్ లో వేసింది ఎందుకంటే నాన్ థియేట్రికల్ రూపంలో వచ్చేది తనదేనని అర్థం అట.

 

డబ్బింగ్,శాటిలైట్, డిజిటల్ రైట్స్ మహేష్ వాటా కిందకి వస్తాయి ఒప్పందం ప్రకారం. అయితే ఇప్పటికే హిందీ డబ్బింగు రైట్స్ లో ఆశించినంత రాలేదు.మహేష్ అంచనాకు ఏడెనిమిది కోట్లు తగ్గిందట. ఇతరత్రా రైట్స్ లోనూ అంత బేరం పలకలేదని తెలుస్తోంది.

 

దీంతో మహేష్ కి దక్కుతుందనుకున్న 50కోట్ల ప్యాకేజ్ అందకుండా పోతోందట. ఎంత తగ్గుతుంది? అన్న లెక్కలేవీ లేవు కానీ అందులో సగం అయితే గ్యారెంటీ ఉందట. ఇక దీనిని బట్టి మార్కెట్ హీరోలకు పాఠం నేర్పుతుందని రుజువు అయింది. ఒక రకంగా హీరోలు ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి లాభమైనా, నష్టమైనా రిస్క్ తమపై కొంత వేసుకున్నట్టే. ఇకపోతే నిర్మాత గోడు పరిశీలిస్తే వేరొక రకంగా అటువైపు కూడా గిట్టుబాటు కావడం లేదట. థియేటర్ల నుంచి కలెక్షన్స్ సరిగా లేకపోవడంతో పంపిణీదారులకు నష్టాలొస్తున్నాయి. తిరిగి వాటిలోంచి కొంత నిర్మాతనే పంపినీదారులకు- బయ్యర్లకు గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుంది అని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: