తెలుగు సినిమా ప్రముఖుల నివాసాలు, కార్యాలయాల్లో తాజాగా  ఆదాయ పన్ను శాఖ జరిపిన సోదాలు తీవ్ర కలకలం రేపిన సంగతి అందరికి తెలిసిందే కదా. నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు ఇళ్లు, కార్యాలయాలతో పాటు రామానాయుడు స్టూడియోలో ఐటీ సోదాలు జరిగాయి. అలాగే ఆయన సోదరుడు ప్రముఖ హీరో 'విక్టరీ' వెంకటేశ్‌ నివాసంలోనూ తనిఖీలు చేశారు. అక్కినేని నాగార్జునకు సంబంధించిన అన్నపూర్ణ స్టూడియోస్‌, ఎంసీహెచ్‌ఆర్‌డీ సమీపంలోని హీరో నాని కార్యాలయాల్లోనూ ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. టాలీవుడ్ లో జరిగిన ఐటీ దాడులపై శ్రీరెడ్డి ఆనందం వ్యక్తం చేసింది. 

Image result for sri reddy

మరీ ముఖ్యంగా సురేష్ బాబు, నానికి సంబంధించిన ఇళ్లు, ఆఫీసులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించడంతో ఆనంద భాష్పాలు రాల్చింది. ఇలాంటి రోజు కోసం ఎన్నాళ్ల నుంచో వెయిట్ చేస్తున్నానని తెలిపింది. శ్రీరెడ్డి ఇంత ఆనందపడ్డానికి కారణం అందరికీ తెలిసిందే. సురేష్ బాబు చిన్నకొడుకు తనను మోసం చేశాడని గతంలో ఆరోపించింది శ్రీరెడ్డి. నిజానికి ఈ కాస్టింగ్ కౌచ్ వ్యవహారంతోనే ఆమె బాగా  పాపులర్ అయింది.

 

Image result for sri reddy

 దీనికి సంబంధించి అభితో శ్రీరెడ్డి క్లోజ్ గా ఉన్న ఫొటోలు కూడా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ వ్యవహారంతో శ్రీ రెడ్డి పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోయింది. కాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమం అంటూ చాలా హంగామా చేసిన శ్రీరెడ్డి.. చాలామంది నటులపై ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో అప్పట్లో నానిపై కూడా తీవ్ర విమర్శలు చేసింది. నాని గురించి పచ్చి పచ్చిగా మాట్లాడేసింది. దీంతో నాని శ్రీ రెడ్డిపై  పరుపు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.

Image result for sri reddy

ప్రత్యేకంగా జగన్, కేసీఆర్, మోదీలకు థ్యాంక్స్.. నాని తనపై పరుపు నష్టం కేసు వేశాడని, సురేష్ బాబు కూడా వేశాడని గతంలో జరిగిన సంఘటలను గుర్తు చేసుకోవడం జరిగింది. ఐటీ రైడ్స్ చేయిస్తున్న వారందరికీ థ్యాంక్స్ అంటూ జగన్, కేసీఆర్, మోదీలకు ధన్యవాదాలను తెలియచేయడం జరిగింది. తనను తెలుగు ప్రజలు అర్థం చేసుకోకున్నా.. తమిళ ప్రజలు తనను అంగీకరించారని చెప్పుకొచ్చింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: