తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో ఒకప్పుడు తన సినిమాలతో ఎన్నో సంచలనాలు సృష్టించారు నటుడు, దర్శకుడు, నిర్మాత టి రాజేందర్.  ఆయన తనయుడే నటుడు సంచలన హీరో శింబు.  అప్పట్లో టి.రాజేందర్ తెరకెక్కించిన ‘ప్రేమసాగరం’ ఎన్నో సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ మూవీ అప్పట్లో యూత్ పై ఎంతో ప్రభావం చూపించింది.  ఆ తర్వాత పలు సంచలన సినిమాలు తెరకెక్కించారు టి.రాజేందర్.  సాధారణంగా ఆయన మీడియా ముందుకు వచ్చాడంటే ఎవరినో ఒకరిని టార్గెట్ చేసుకుంటారని రూమర్లు ఉన్నాయి. తాజాగా ఈసారి ఆయన రజినీ, కమల్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

ఎన్‌ఎస్‌సీ డిస్ట్రిబ్యూటర్స్ ఎసోసియేషన్‌‌‌లో సెక్రటరీ స్థానం కోసం రాజేందర్ పోటీ చేయనున్నారు. డిసెంబర్ 22న ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఓ విలేఖరి రజినీకాంత్, కమల్ హాసన్‌లాగా రాజకీయాల్లోనూ పోటీ చేస్తారా అని అడిగారు. దాంతో ఆయన అసహనంగా స్పందిస్తూ..రజనీకాంత్, కమలహాసన్‌ రాజకీయాల గురించి తనను అడగడంలో అర్థం లేదని అన్నారు. నటులుగా రజనీకాంత్, కమలహాసన్‌లకు తాను అభిమానినని అన్నారు. వారిలా నేను పాలిటిక్స్‌లో సక్సెస్ అవ్వలేదని నా చేత చెప్పించాలనుకుంటున్నారా? నన్ను రెచ్చగొట్టి టీఆర్‌పీ రేటింగ్స్ పెంచుకోవాలనుకుంటున్నారా? నాపేరు టీఆర్. నేనెప్పుడూ టీఆర్‌పీలల్లో టాప్‌లో ఉంటాను.  

 

అయితే రాజకీయాల్లో తాను వారిద్దరి కంటే సీనియర్‌నని అన్నారు. నటన పరంగా నేను వారికి ఎంతో మంచి అభిమానిని..అయితే ఇండస్ట్రీలో వారు నాకంటే సీనియర్లు. వారి రాజకీయ నిర్ణయాల గురించి నన్ను ప్రశ్నించకండి  అని ఘాటుగా సమాధానమిచ్చారు.  రాజకీయాల్లో విజయం సాధించడానికి అనుభవం ఉంటే చాలదని,అదృష్టం ఉండాలని అన్నారు, తాను అధికారాన్ని పొందడానికి రాజకీయ పార్టీని ప్రారంభించలేదని అన్నారు.  ఒకప్పుడు తన సినిమాలు మహిళలు, యూత్ ఎంతగానో ఆదరించారని..కానీ ఇప్పటి పరిస్థితులు చాలా దారుణంగా మారాయని అన్నారు.  ప్రస్తుతం డబ్బున్న వాళ్లే థియేటర్లోకి వెళ్లి చూసే పరిస్థితి నెలకొంది అన్నారు. కాగా, వచ్చే నెల 22న చెన్నై, కాంచీపురం, తిరువళ్లూర్‌ జిల్లాల సినీ డిస్ట్రిబ్యూటర్ల సంఘానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రాజేందర్‌ జట్టు పోటీ చేయనున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: