ఈ మ‌ధ్య హీరోయిన్లు వేసే డ్ర‌స్సులు పై వివాదాలు ఎక్కువ‌యిపోయాయి.  అది వాళ్ళు వేసే బ‌ట్ట‌లు అయితే ఏద‌న్న ఒక కంపెనీకి బ్రాండ్ ఎంబాసిడ‌ర్‌లాగా ఆ లోగో ఉన్న దుస్తుల‌ను ధ‌రించ‌డం లాంటివి చేస్తుంటారు. అయితే ప్ర‌స్తుతం బాలీవుడ్ న‌టి వాణీక‌పూర్ వేసిన ఓ డ్ర‌స్ పై వివాదం మొద‌లైంది. 

 

ఇటీవ‌లె ఈ భ‌మ ఓ హాట్ ఫొటో షూట్‌ను ఇంట‌ర్నెట్‌లో పెట్టి ఇబ్బందుల్లో ప‌డింది. అదేమిటంటే ఆమె ధ‌రించి స్వీవ్‌లెస్ బ్లౌజ్‌, ల‌హెంగా పైన హ‌రే రామ్ అన్న ప‌దాలు ఉండ‌టం. ఆ ఫొటోల‌ను చూసిన కొంద‌రు ఆమెను ట్రోల్ చేయ‌డం మొద‌లుపెట్టారు. కొంద‌రి మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా ఉన్న ఈ ఫొటోల పై అభ్యంత‌ర‌క‌రం వ్య‌క్త‌మ‌యింది. దీంతో వాణీ ఆ ఫొటోల‌ను వెంట‌నే త‌న సోష‌ల్ మీడియా నుంచి తీసేసింది. 

 

అయినా అప్ప‌టికే చూసేసిన కొంద‌రు ఫొటోను డౌన్‌లోడ్ చేసి మ‌రి ట్రోల్ చేయ‌డం మొద‌లుపెట్టారు. కాని దీని పై వాణీ మాత్రం ఎటువంటి కామెంట్స్ చేయ‌కుండా సైలెంట్‌గా ఉండిపోయింది. అయితే తాజాగా ఇప్పుడు ఈ భ‌మ పై ముంబైకి చెందిన రామ సావంత్‌ అనే వ్యక్తి ఎన్‌ఎమ్‌ జోషీ మార్గ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశాడు. వాణీ వేసిన దుస్తులు కార‌ణంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ ఆయన కేసు నమోదు చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఈ మధ్యే విడుద‌లైన  సూపర్‌ హిట్ చిత్రం వార్‌లో హృతిక్ కి జోడి న‌టించిన  ఈ భామ ప్రస్తుతం రణబీర్‌ కపూర్‌కు జోడిగా షంషేర్ చిత్రంలో నటిస్తోంది.  పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వంచరస్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూలైలో రిలీజ్‌ కానుంది. మ‌రి ఈ భామ రాబోయేచిత్రాలు ఎలా ఉండ‌బోతున్నాయో బాక్సాఫీస్ ముందు ఎలాంటి క‌లెక్ష‌న్లు సాధిస్తాయో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: