సౌత్ ఇండియన్ ఫిమేల్ సూపర్ స్టార్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు నయనతార. వయసుతో పాటు సినిమాలు పెరగడమే నయన్ స్పెషాలిటీ. తరగని అందం, క్రేజీ ఆఫర్స్ తో నయనతార దూసుకుపోతోంది. సీనియర్ హీరోయిన్స్ కు అవకాశాలు తగ్గుతుంటే నయన్ కు మాత్రం పెరుగుతున్నాయి. సౌత్ లో నయన్ అంటే రెమ్యునరేషన్ ఎక్కువ, ప్రమోషన్స్ కు రాదు, డిమాండ్స్ ఎక్కువ.. అనే అంశాలు కూడా స్ఫురణకు వస్తాయి. ఇప్పుడలాంటి షాకే దర్శక, నిర్మాతలకు ఇస్తోంది నయనతార.

 

 

ఇప్పటి వరకూ తన క్రేజ్ కు అనుగుణంగా తన రెమ్యునరేషన్ ను 6కోట్లు తీసుకుంటూ సౌత్ లో నెంబర్ వన్ పొజిషన్ లో ఉందనే టాక్ ఉంది. ఇప్పుడు ఆ ఫిగర్ ను మరింత పెంచిందని కోలివుడ్ టాక్. ఇకపై చేసే సినిమాలకు 7కోట్లకు తక్కువ కాకుండా 8కోట్ల వరకూ తీసుకోవాలని డిసైడ్ అయిందట. ప్రస్తుతం తాను చేస్తున్న భక్తిరస పాత్రకు కూడా ఇంతే డిమాండ్ చేసిందని సమాచారం. ఇంతే చేస్తే ప్రమోషన్ల విషయంలో మాత్రం నిర్మాత, దర్శకుడు, హీరో వాళ్ల తిప్పలు వాళ్లే పడాల్సిందే. ఇటివల నిర్మాతలు నయన్ విషయంలో ఒక తీర్మానానికి వచ్చారని కూడా వార్తలు వచ్చాయి. కానీ అమ్మడి క్రేజ్ దృష్ట్యా ఎవరూ సాహసించటం లేదని కూడా కోలీవుడ్ కోడై కూస్తోంది.

 

 

సైరాలో ఆమె చేసిన పాత్రకు 6కోట్లు సమర్పించుకున్నా నయన్ వల్ల సినిమాకు వచ్చిన హైప్ ఏమీ లేదు. ఇంత ఎక్కువగా తీసుకుంటున్నా సినిమా షూటింగ్ పూర్తయ్యాక ఇక ఆ సినిమాతో అమ్మడికి సంబంధం ఉండదు. ఈ విషయంలో ఎంతటి స్టార్ సినిమా అయినా ఆమె దృష్టిలో ఒకటే. మెగాస్టార్ చిరంజీవి సైరాకు కూడా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. త్వరలో రిలీజ్ కాబోతున్న సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాకు తన నిర్ణయంలో మార్పులు ఏమన్నా చేసుకుంటుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: