'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మరియు 'జర్నీ' సినిమాతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అంజలి తెలుగు భాషలో సొంతంగా డైలాగులు చెబుతూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో చేసిన క్యారెక్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకులనుండి దక్కించుకున్న ఆ తరువాత కొనసాగించ లేక పోయింది. ఇటువంటి నేపథ్యంలో అంజలి కొంతకాలం తర్వాత జర్నీ ఫేం హీరో జై తో ప్రేమాయణం సాగించిన  విషయం అందరికీ తెలిసినదే. 2017 సంవత్సరంలో అంజలి, జై కలిసి 'బెలూన్' అనే సినిమాల్లో నటించారు. అయితే సినిమా రిలీజ్ అయ్యి దారుణంగా ఫ్లాప్ అయి నిర్మాతలకు తీవ్రమైన నష్టాలు మిగిల్చింది.

 

ఈ సందర్భంగా 'బెలూన్' సినిమా నిర్మాత నందకుమార్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని...హీరోయిన్ అంజలి గురించి మరియు అదే విధంగా జై తో ఉన్న రిలేషన్ షిప్ గురించి షాకింగ్ కామెంట్ చేశాడు. విషయంలోకి వెళితే నిర్మించిన బెలూన్ సినిమా పరాజయం పాలు కావడానికి కారణం హీరో జై అని అతని ప్రవర్తన వల్ల చాలా ఇబ్బందులు షూటింగ్ సమయంలో ఎదుర్కొన్నామని దాంతో తలకు నష్టాలు చాలా ఎదురయ్యాయని నిర్మాత నందకుమార్ ఆరోపించారు. అంతేకాకుండా హీరోయిన్ అంజలి చాలా మంచి అమ్మాయి ప్రొఫెషనల్ లైఫ్ విషయంలో చాలా సిన్సియర్ గా పనిచేసే అమ్మాయి ఎప్పుడైతే హీరో జై తో ప్రేమలో పడిందో...పూర్తిగా మారిపోయిందని నిర్మాత నందకుమార్ పేర్కొన్నాడు.

 

కాగా 'బెలూన్' సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో కొడైకెనాల్ లో అంజలి, జైకి వేరు వేరు గదులు బుక్ చేశాం. కానీ వారిద్దరూ ఒకే గదిలో గడిపేవారు. రెండో రూమ్ వృధా అని క్యాన్సిల్ చేయబోతే జై చిరుబుర్రులాడాడు. రెండో గది కూడా ఉండాల్సిందే అని పట్టుబట్టాడు. ఆ గదికి ఒక రోజులు అద్దె 12 వేలు అని చెప్పినా వినకుండా రచ్చరచ్చ చేసేవాడు. ఇదే క్రమంలో హీరోయిన్ అంజలి షూటింగ్ కి రాకుండా జై గదిలోనే ఎక్కువగా ఉండేది అంటూ నిర్మాత నందకుమార్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: