టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా సినిమా కమ్మరాజ్యంలో కడపరెడ్లు ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. అలానే మొన్న రిలీజ్ చేసిన రెండవ ట్రైలర్ కూడా వీక్షకలును ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై భారీగా అంచనాలు క్రియేట్ చేసింది. ఇక ఈ ట్రైలర్ పై కొందరు ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు కూడా. ముఖ్యంగా ఈ రెండు ట్రైలర్ లను బట్టి చూస్తే ఆంధ్రలోని ప్రధాన పార్టీల అధినేతలను ఎవ్వరినీ వదలకుండా, వర్మ వారిపై సెటైరికల్ గా సినిమా తీసినట్లు అర్ధం అవ్వక మానదు. 

 

ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లను ఈ సినిమా ద్వారా బాగా టార్గెట్ చేసిన వర్మ, వారితో పాటు వైసిపి అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై కూడా వ్యంగ్యాస్త్రాలు పేలుస్తునట్లు తెలుస్తోంది. ఇకపోతే అతి త్వరలో రిలీజ్ కు సిద్ధం కాబోతున్న ఈ సినిమాకు మరొక రెండు రోజుల్లో సెన్సార్ కార్యక్రమాలు జరగనుండగా, సెన్సార్ చేయకుండా, సినిమాను నిషేధించి, విడుదలను కూడా పూర్తిగా ఆపివేయాలని ఇంద్ర సేన చౌదరి అనే వ్యక్తి నేడు సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేయడం జరిగింది. 

 

ఆంధ్రాలోని రెండు ప్రధాన కులాలను వర్మ కించపరిచేవిధంగా సినిమా తీయడంతో పాటు, వారి మధ్య చిచ్చు పెట్టె విధంగా వర్మ ఈ సినిమా తీస్తున్న విషయం ట్రైలర్ ని బట్టి చూస్తే అర్ధం అవుతుందని, కాబట్టి రాబోయే రోజుల్లో పలు వివాదాలకు దారితీసే విధంగా రూపొందిన ఈ సినిమాను పూర్తిగా ఆపివేయాలని ఇంద్రసేన సెన్సార్ వారిని కోరడం జరిగింది. అయితే అతడి ఫిర్యాదును స్వీకరించిన సెన్సార్ బోర్డు సభ్యులు, ఏ విధంగా తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారో చూడాలి. కాగా ఈ వార్త ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: