ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో హీరోలు కేవలం రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకునే వారు. లాభాల్లో వాటా కావాలని అడిగేవారు కాదు. ఒకవేళ ఒక హీరోని నమ్మి గనక నిర్మాత సినిమా తీసి అది ఫ్లాపయితే ఆ నిర్మాతకోసం మరో సినిమాకి వెంటనే డేట్స్ ఇచ్చి ఆ నిర్మాతని ఆదుకునేవాళ్ళు. ఆ విషయంలో సూపర్ స్టార్ కృష్ణ ఉత్తమమైన వ్యక్తి అని చాలా గొప్పగా చెప్పొచ్చు. ఆ తర్వాత తారక్ కూడా ఇలా నిర్మాతకి నష్టాలొస్తే వెంటనే తన వంతు కాస్త రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడంతా పద్దతి పూర్తిగా మారిపోయింది. స్టార్స్.. సూపర్ స్టార్స్ ల రెమ్యూనరేషన్ విషయం ఇండస్ట్రీలో ఎప్పుడు హాట్ టాపిక్ అనే చెప్పాలి. గత కొంత కాలంగా రెమ్యూనరేషన్ లెక్కలు మారాయి. రిస్క్ నిర్మాతల నుంచి తీసుకుంటున్నాం! అంటూ లాభాల్లో వాటాలు.. ఏరియాల హక్కులు అడగడం కొంతమంది హీరోల్లో బాగా అలవాటైంది. అయితే ఇందులోనూ లాజిక్ అప్లయ్! అంటూ హీరోలు వేస్తున్న స్కెచ్ కి నిర్మాతలకి చుక్కలు కనిపిస్తున్నాయి. అసలు థియేట్రికల్ కలెక్షన్స్ కంటే ఇప్పుడు నాన్ థియేట్రికల్ ద్వారా వచ్చే ప్యాకేజ్ మొత్తం ఆశావహంగా ఉండడంతో ఆ మొత్తాన్ని నిర్మాతకు దక్కకుండా తమ ఖాతాల్లో పడేలా హీరోలు జాగ్రత్త పడుతున్నారని ప్రచారమవుతోంది. నాన్ థియేట్రికల్ రైట్స్ మాకు ఇచ్చేయండి .. అదే మా పారితోషికం అంటూ ఇప్పుడు హీరోలు డిమాండ్ చేస్తుండటంతో కొంతమంది నిర్మాతలు వర్కౌట్ అవదని తెలిసినా మొండిగా ధైర్యం చేసి ఒప్పుకుంటున్నారు.

అయితే నాన్ థియేట్రికల్ రైట్స్ అనేవి హీరో రేంజును బట్టి మార్కెట్ ట్రెండును బట్టి ఎప్పటికప్పుడు మారుతుంటుందన్న సంగతి తెలిసిందే. స్టార్ డమ్ కి తగ్గట్టు ఒక్కోసారి వర్కవుటైనా ఒక్కోసారి ఊహించని రీతిలో బ్యాక్ ఫుట్ వేస్తుంటుంది. అలా ఈసారి సూపర్ స్టార్ మహేష్ ప్లాన్ ఈ సారి గట్టిగా బెడిసికొట్టిందని తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాకి నాన్ థియేట్రికల్ రైట్స్ తనకే చెందుతాయి అని మహేష్ రెమ్యూనరేషన్ లేకుండా ఒప్పందం చేసుకున్నారట. జీఎంబీ బ్యానర్ లోగోని పోస్టర్ లో వేసింది ఎందుకంటే నాన్ థియేట్రికల్ రూపంలో వచ్చేది తనదేనని అర్థం అట.

డబ్బింగ్.. శాటిలైట్.. డిజిటల్ రైట్స్ నిర్మాతలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం మహేష్ వాటా కిందకి వస్తాయి.  అయితే ఇప్పటికే హిందీ డబ్బింగు రైట్స్ లో అనుకున్నంత రాలేదు. లెక్క వేసుకున్నదానికంటే 7-8 కోట్ల వరకు తగ్గిందట. మిగతా రైట్స్ లోనూ అంత డిమాడ్ రాలేదని తాజా సమాచారం. దీంతో మహేష్ కి దక్కుతుందనుకున్న 50కోట్ల మినిమం ప్యాకేజ్ రావడం లేదని న్యూస్. ఇక దీనిని బట్టి మార్కెట్ హీరోలకు పాఠం నేర్పుతుందని రుజువవుతోంది. ఒక రకంగా హీరోలు ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి లాభమైనా.. నష్టమైనా రిస్క్ తమపై కొంత వేసుకున్నట్టే. ఇక నిర్మాతల గురించి తెలిసిందే. మునిగితే మునుగుతారు...తేలితే తేలతారు. ఇక థియేటర్ల నుంచి కలెక్షన్స్ సరిగా లేకపోవడంతో పంపిణీదారులకు కూడా నష్టాలొస్తున్నాయి. తిరిగి వాటిలోంచి కొంత నిర్మాతనే పంపినీదారులకు- బయ్యర్లకు గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుంది. మహేష్ తో సరిలేరు నిర్మాత అనీల్ సుంకర ఒప్పందం ఏమిటి? అసలేం జరుగుతోంది? అంటూ ట్రేడ్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అసలే అనీల్ సుంకర పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఈ సినిమా గనక అటు ఇటు అయితే ఇక అంతే..! 

మరింత సమాచారం తెలుసుకోండి: