ఐదారేళ్లుగా కామెడీకి కేరాఫ్ అడ్రెస్ అయిన జబర్దస్త్ షో బుల్లితెర మీద నవ్వులు పంచుతూ అదరగొట్టింది. ఓ రకంగా ఈటివికి మంచి టి.ఆర్.పి రేటింగ్స్ తీసుకు రావడంలో జబర్దస్త్ ఎంతో సపోర్ట్ చేసింది. ఈ షో వల్లే ఈటివి బాగా పాపులారిటీ తెచ్చుకుంది. తన స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే ఈటివి ఇలాంటి కామెడీ షో చేస్తుందని ఎవరు ఊహించలేదు.     

 

సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న ఈ షో వల్ల ఎంతోమంది ఎంటర్టైన్ అవుతున్నారు. అయితే సడెన్ గా ఏమైందో ఏమో జబర్దస్త్ నుండి మెగా బ్రదర్ నాగబాబు బయటకు రావడంతో అందరు షాక్ అయ్యారు. కేవలం నాగబాబు మాత్రమే కాదు చమ్మక్ చంద్ర, ఆర్పి కూడా బయటకు వచ్చారు. యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ కు షాక్ ఇస్తూ బయటకు వచ్చింది.

 

ప్రస్తుతం వీరంతా జీ తెలుగులో సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం షోలో కనబడుతున్నారు. ఈ ఛానెల్ లోనే గ్యాంగ్ స్టర్స్ అంటూ త్వరలో జబర్దస్త్ లాంటి ఒక కామెడీ షోనే మొదలు పెడతారట. ఆ షో ద్వారా జబర్దస్త్ కు చెక్ పెట్టాలని చూస్తున్నారు. జీ బ్రాండింగ్ చాలా పెద్దది.. వారి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉంటాయి. మరి అలాంటి జీ తెలుగులో జబర్దస్త్ లాంటి షో క్లిక్ అయితే ఓ రేంజ్ లో ఉంటుంది.

 

ఇక యాంకర్ ప్రదీప్ కూడా ఈ షో చేసేందుకే ఈటివి అన్ని షోలకు దూరమయ్యాడని తెలుస్తుంది. మరి కొత్త హంగులతో కొత్త కామెడీతో వస్తున్న ఈ జీ తెలుగు కామెడీ షో ఎలా ఉంటుందో చూడాలి. సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం ప్రోగ్రాం లో మాత్రం జబరస్త్ లో లానే వేణు ఒక స్కిట్ వేశాడు. ఆర్పి, చమ్మక్ చంద్ర కూడా స్కిట్స్ వేస్తున్నారు. పటాస్ లో కొందరు కమెడియన్స్ కు ఇందులో ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: