టాలీవుడ్‌లో మినిమమ్‌ గ్యారెంటీ హీరోగా.. మీడియం రేంజ్‌ సినిమాల టాప్‌ స్టార్‌గా ఎదిగిన నటుడు నేచురల్‌ స్టార్ నాని. హీరోగా సత్తా చాటుతునే తన మనసుకు నచ్చిన సినిమాలను తెరకెక్కించేందుకు నిర్మాతగానూ మారాడు. వాల్‌ పోస్టర్‌ సినిమా బ్యానర్‌ను స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నాడు. తొలి ప్రయత్నంగా నాని నిర్మించిన 'అ!' కమర్షియల్‌గా వర్క్‌ అవుట్‌ కాకపోయినప్పటీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా నాని టేస్ట్‌  ఏంటో తెలిసేలా చేసింది. దీంతో విభిన్న కథలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్న యంగ్‌ డైరెక్టర్స్‌ నానిని సంప్రదిస్తున్నారు.

నిర్మాతగా తొలి సినిమా తరువాత లాంగ్ గ్యాప్‌ తీసుకున్న నాని ఇటీవల తన రెండో సినిమాను కూడా ప్రకటించాడు. ఫలక్‌నుమా దాస్‌ సినిమాతో సెన్సేషన్‌ సృష్టించిన విశ్వక్‌ సేన్‌ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా రీసెంట్‌గా ప్రకటించాడు నాని. అయితే ఇంతలోనే ఈ యంగ్ హీరో మరో సినిమాను కూడా తన బ్యానర్‌లో ప్లాన్ చేస్తున్నట్టుగా ఫిల్మ్ నగర్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మహేష్ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథకు నాని ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌లో నాని హీరోగా నటిస్తున్నాడా..? లేక తన బ్యానర్‌లో నిర్మించేందుకు ఓకె చేశాడా అన్న విషయం ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. 

ప్రస్తుతం నాని ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో 'వి' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాని తొలి సారిగా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా నానీకి ఒక డిఫ్రెంట్ ఇమేజ్ తీసుకు వస్తుందని ఇప్పటికే ధీమాగా ఉన్నాడు నాని. అంతేకాదు నేచురల్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ సక్సస్ ఇస్తుందని కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి చూడాలి ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక నానీ కాస్త డీలా పడ్డ సంగతి తెలిసిందే. జెర్సీ మీద ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికి ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది గానీ కమర్షియల్ గా మాత్రం తృప్తి నివ్వలేకపోయింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: