మనం ఎంతగానో ఎదురుచూసే సరిలేరు నీకెవ్వరు టీజర్ తాజాగా విడుదలయి యూట్యూబ్లో ఒక సంచలనం సృష్టిస్తోంది. అందులోని డైలాగ్స్ చాలా బాగున్నాయి.. ఒకసారి అవేంటో చూద్దాం.

'మీరు ఎవరో మాకు తెలియదు.. మీకు మాకు ఏ రక్త సంబంధం లేదు.. కాని మీ కోసం మీ పిల్లల కోసం ఎండ వాన అని లేకుండా పోరాడుతూనే ఉంటాం ఎందుకంటే మీరు మా బాధ్యత’ అంటూ వెంట్రుకలు నిక్కపొడిచే మహేష్ బాబు డైలాగ్‌తో 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ స్టార్ట్ చేసాడు దర్శకుడు అనిల్ రావిపూడి.

మరొక సీన్ లో  ‘మీరంతా నేను కాపాడుకునే ప్రాణాలురా.. మిమ్మల్ని ఎలా చంపుకుంటానురా.. మీ కోసం ప్రాణాలను ఇస్తున్నాం రా అక్కడ. మీరేమో కత్తులు గొడ్డలు వేసుకుని ఆడాళ్ల మీద. బాధ్యత ఉండక్కర్లా' అంటూ తనదైన శైలిలో ఒక డైలాగ్ ని సూపర్ గా డెలివరీ చేస్తాడు మన ప్రిన్స్.

'భయ పడే వాడే బేరానికి వస్తాడు.. మన దగ్గర బేరాల్లేవమ్మా’  అంటూ ఫుల్ మాస్ గా కనిపించి దుమ్మురేపాడు మహేష్ బాబు.

' గాయం విలువని తెలిసినవాడే.. సాయం చేస్తాడు బాబాయ్' అంటూ లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి పవర్ ఫుల్ డైలాగ్ ను వదిలి ఫాన్స్ ని ఫిదా చేసేసింది.


‘ప్రతి సంక్రాంతికి అల్లుళ్లు వస్తారు.. ఈ సంక్రాంతికి మొగుడు వచ్చాడు’ అంటూ మహేష్ బాబును ఉద్దేశిస్తూ ప్రకాష్ రాజ్ ఫ్రస్ట్రేషన్ తో ఫన్నీ డైలాగ్ వదిలడంతో ఈ టీజర్ ముగుస్తుంది.

మహేష్ సినీ కెరీర్ లో ఈ సినిమా 26వది. సంక్రాంతికి విడుదలయ్యే ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని ఈ టీజర్ చూస్తే ఇట్టే అర్థం అవుతుంది. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించడం ఈ సినిమాకి ఒక ప్లస్ గా చెప్పుకోవచ్చు. ఫైట్స్ చూస్తుంటే ఈ సినిమాలో యాక్షన్ ఫుల్ గా ఉంటుందని స్పష్టమవుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: