పండుగాడు మరోసారి టాలీవుడ్ బాక్సాఫీస్‌ను దున్నేయడానికి వస్తున్నాడు. ఇన్ని రోజుల నుండి మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఘట్టం రానే వచ్చేసింది. రావడంతోనే సరిలేరు నీకెవ్వరు సినిమా టిజర్ ప్రతి సంక్రాంతికి అల్లుళ్లు వస్తారు ఈ సంక్రాంతికి మొగుడు వచ్చాడు అంటూ దుమ్ము రేపుతున్నాడు.. ఇక ఈ చిత్రంలో ఉన్న విశేషమేంటంటే చాలా రోజుల తర్వాత అలనాటి తార విజయశాంతి రీఎంట్రీ ఇవ్వనుంది.

 

 

ఇప్పటికే రిలీజ్ చేసిన ఆమె లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే మిలటరీలో పనిచేసే అజయ్ గా మహేష్ ని చూపిస్తూ టిజర్ మొదలవుతుంది. భయపడేవాడే బేరానికి వస్తాడు.. మన దగ్గర బేరాల్లేవు అంటూ మహేష్ చెప్పే డైలాగ్ బాగుంది.. గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడని విజయశాంతితో డైలాగ్ చెప్పించాడు దర్శకుడు అనిల్.. ఈ టీజర్‌లో వచ్చే ప్రతి డైలాగ్ అక్షరాలకు ప్రాణం పోస్తుందన్నట్లుగా ఉంటుంది.

 

 

అనిల్ రావిపూడి పెన్ పవర్‌కు మహేష్ డైలాగ్ డెలివరీ తోడు కావడంతో టీజర్ విజిల్స్ వేయించేదిగా ఉంది. ఇదే కాకుండా ‘మీరంతా నేను కాపాడుకునే ప్రాణాలురా.. మిమ్మల్ని ఎలా చంపుకుంటానురా..  అక్కడ మీ కోసం ప్రాణాలను ఇస్తున్నాం రా. మీరేమో కత్తులు గొడ్డలు వేసుకుని ఆడాళ్ల మీద. బాధ్యత ఉండక్కర్లా’ అంటూ మహేష్ చెప్తున్న డైలాగ్ అనిల్ రావిపూడి మార్క్‌లో చాలా ఫన్నీగా ఉంటుంది.

 

 

ఇక  మహేశ్ కెరీర్లో 26వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పటాస్, సుప్రీమ్, రాజా దిగ్రేట్, f2 లాంటి వరుస బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రాన్ని జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్, ఏకే ఎంటర్‌టైన్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మించగా. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలను సమకూర్చారు.. మహేష బాబు సరసన అదితీ రావు, రష్మిక హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: